Korean Mom and Dughter: సోషల్ మీడియా(Social Media)వచ్చిన తర్వాత ప్రపంచంలోని ప్రజలదరినీ ఒక్కటి చేసింది. వివిధ ప్రాంతాలలో నివసించే వ్యక్తులు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేలా చేసింది. తాజాగా పశ్చిమ బెంగాల్(wet Bengal)కు చెందిన వేరుశనగలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ పాడిన పాట వైరల్ అయిన దేశ విదేశాల్లో కూడా ఫేమస్ అయింది. తాజాగా ఈ సాంగ్ కు దక్షిణ కొరియాకు చెందిన తల్లి-కూతురు ద్వయం డ్యాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఈ వీడియో తో దాసోమ్ ఆమె తల్లి కచా బాదం తమ డ్యాన్స్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు.
దాసోమ్ ఆమె తల్లి కచా బాదమ్ సాంగ్ .. పెప్పీ బీట్‌కి కొన్ని కూల్ స్టెప్స్ వేయడంతో వీడియో ప్రారంభమవుతుంది. వీరిద్దరూ పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం అందరినీ కట్టుకుంది. ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది మేము సంతోషంగా ఎంజాయ్ చేస్తున్న సమయం.. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. మా ప్రేమకు చీర్స్” అంటూ ఆ డ్యాన్స్ వీడియోకి క్యాప్షన్‌ని ఇచ్చారు. అంతేకాదు వీడియోకి భారతదేశం ,కొరియా జెండాలను జత చేసి.. తమ దేశంతో పాటు.. భారతదేశాన్ని కూడా తము ఇష్టపడుతున్నామని చెప్పకనే చెప్పారు.
ఈ వీడియోకు 17వేలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాసోమ్, తన తల్లి తో చేసిన డ్యాన్స్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
కచా బాదం పాట ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో క్రేజీ వైరల్ ఆడియో పీస్. చాలా మంది ఈ పాటను డ్యాన్స్ రీల్స్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ పాట పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్ రుశెనగ విక్రేతకు పాడిన పాట. వీధిలో వేరుశెనగను విక్రయించే భుబన్ పాడుతున్న సమయంలో ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి నెటిజన్లు ఆకట్టుకునే ట్యూన్‌ను తీసుకొని, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామర్‌ల హాట్ ఫేవరెట్ అయిన పెప్పీ ట్రాక్‌లోకి రీమిక్స్ చేశారు.
Also Read: