Viral Video: వాహనాల రద్దీతో యువకుడు రోడ్డు దాటడానికి పాట్లు.. చివరకు చిన్నపిల్లడిగా మారి మరీ.. ఫన్నీ వీడియో వైరల్

|

Oct 17, 2023 | 10:28 AM

రోడ్డు దాటడం అనే సమస్య మీరు కూడా ఎదుర్కొంటుంటే.. ఈ రోజు మేము మీ కోసం ఒక వీడియోను  తీసుకువచ్చాము. ఒక బాలుడు తన తెలివి తేటలను ఉపయోగించి అద్భుతమైన ఆలోచనలతో రోడ్డు దాటాడు. ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ క్లిప్ చూసిన తర్వాత మీ మనసులో కూడా ఓ ఆలోచన వస్తుంది. ఈ సోదరుడు ఎవరు?

Viral Video: వాహనాల రద్దీతో యువకుడు రోడ్డు దాటడానికి పాట్లు.. చివరకు చిన్నపిల్లడిగా మారి మరీ.. ఫన్నీ వీడియో వైరల్
Viral Video
Follow us on

ప్రస్తుత కాలంలో రోజు రోజుకీ మనుషులతో పాటు వాహనాల సంఖ్య కూడా బాగా పెరిగిపోతున్నాయి. దీంతో మనుషులు రోడ్ల పై నడవక తప్పని సరి అయినా.. అడుగు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు దాటడం చాలా కష్టంగా మారుతోంది. ఈ కారణంగానే ప్రభుత్వం రోడ్లు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తోంది. దీంతో ప్రమాదాలు జరగకుండా ఈ వంతెనలు లేని చోట రోడ్డు దాటాల్సి వస్తోంది. ప్రస్తుతం రోడ్డు దాటడం అంటే ఓ యుద్ధం చేయాల్సి వస్తుంది. రోడ్డు దాటడం అతి కష్టంగా మారింది.

రోడ్డు దాటడం అనే సమస్య మీరు కూడా ఎదుర్కొంటుంటే.. ఈ రోజు మేము మీ కోసం ఒక వీడియోను  తీసుకువచ్చాము. ఒక బాలుడు తన తెలివి తేటలను ఉపయోగించి అద్భుతమైన ఆలోచనలతో రోడ్డు దాటాడు. ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ క్లిప్ చూసిన తర్వాత మీ మనసులో కూడా ఓ ఆలోచన వస్తుంది. ఈ సోదరుడు ఎవరు?

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు ఫుట్‌పాత్‌పై నిల్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఎలాగైనా రోడ్డు దాటాలని చాలాసార్లు ప్రయత్నించాడు. ఆ రోడ్డు మీద చాలా వాహనాలు వెళుతున్నాయి, అతనికి రోడ్డు దాటడానికి అవకాశం దొరకలేదు. అప్పుడు ఆ యువకుడు తాను రోడ్డు దాటడానికి ఒక గొప్ప టెక్నిక్‌ని కనిపెట్టాడు. అతను నడవలేనట్లుగా మోకాళ్లపై నిలిచి రోడ్డు దాటడం ప్రారంభిస్తాడు. ఆ యువకుడు రోడ్డు దాటడం చూసి వాహనాల నడుపుతున్న డ్రైవర్లు ఆటోమేటిక్‌గా ఆగిపోయారు. అప్పుడు ఆ యువకుడు చాలా ఈజీగా రోడ్డు దాటాడు.

ఈ వీడియోను @ghantaa అనే ఖాతా ద్వారా Instagram లో షేర్ చేశాడు. ఇది 11 వేల మందికి పైగా లైక్ చేశారు. లక్షల మంది ప్రజలు ఈ వీడియోను చూశారు. చూస్తున్నారు. భిన్నమైన కామెంట్స్ చేస్తూ తమ  అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..