VIral Video: చేతిలో పోస్టర్‌తో గాల్లో ప్రపోజ్‌ చేసిన ప్రియుడు.. ప్రియురాలి రియాక్షన్‌ ఏంటంటే..

|

Jan 12, 2023 | 8:14 PM

ఈ అందమైన క్షణం ఎయిర్ ఇండియా విమానంలో జరిగింది. ఈ వీడియోను రమేష్ కొట్నానా అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో నిడివి కేవలం 51 సెకన్లు మాత్రమే.

VIral Video: చేతిలో పోస్టర్‌తో గాల్లో ప్రపోజ్‌ చేసిన ప్రియుడు.. ప్రియురాలి రియాక్షన్‌ ఏంటంటే..
Flight Proposes
Follow us on

గత కొద్ది రోజులుగా విమాన ప్రయాణానికి సంబంధించి అనేక రకాల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అలాంటిదే మరోక వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. విమానంలో గాల్లో ఎగురుతుండగా, ఓ యువకుడు తన ప్రియురాలికి ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి ప్రయాణికులంతా ఆశ్చర్యపోయారు. విమానంలో ప్రయాణిస్తూ గాల్లో ప్రపోజ్‌ చేసిన అతడి ఆలోచనకు అందరు ఫిదా అయిపోయారు. అయితే, అతడి గర్ల్‌ఫ్రెండ్‌ ఎలా రియాక్ట్స్‌ అయ్యిందో తెలుసా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియోలో ఒక యువకుడు తన ప్రియురాలికి అందరి మధ్య గాలిలో ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రయాణిస్తున్న యువతి కిటికీ పక్కన కూర్చుని ఉండగా, యువకుడు పోస్టర్‌తో వచ్చాడు. అతన్ని చూసి ఆమె కాస్త ఆశ్చర్యపోయింది. అతను ఆమెను ప్రపోజ్ చేయడానికి సిద్ధపడ్డాడు. ఒక మోకాలిపైకి దించి ఆమెకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు.

జనవరి రెండో తేదిన ఓ యువతి ముంబై వెళ్లేందుకు విమానంలో ప్రయాణించింది. ఆమె ఎయిర్‌ ఇండియాలో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్న ప్రియుడు కూడా అదే విమానంలో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. తన ప్రేయసికి వినూత్నంగా ప్రపోజ్‌ చేయాలని భావించి ఇందుకు విమాన సిబ్బంది సాయం కోరాడు. విమానం టేకాఫ్‌ అయ్యాక ఓ చార్ట్‌ పట్టుకొని మెల్లగా ప్రియురాలు కూర్చున్న సీట్‌ వద్దకు చేరుకున్నాడు. యువకుడి చేతిలో ఉన్న పోస్టర్‌ చూసిన ఆమె నిజంగా ఆశ్చర్యపోయింది. ఆనందంతో అతడి ప్రేమను అంగీకరిస్తూ.. ఆ వ్యక్తిని కౌగిలించుకొని అతని చెంపై ముద్దు పెట్టింది. విమానంలోని మిగతా ప్రయాణికులు చప్పట్లతో ఈ జంటను అభినందించారు. ఈ అందమైన క్షణం ఎయిర్ ఇండియా విమానంలో జరిగింది. ఈ వీడియోను రమేష్ కొట్నానా అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో నిడివి కేవలం 51 సెకన్లు మాత్రమే.

చాలా మంది ఈ వీడియోను లైక్ చేసి కామెంట్స్ చేశారు. భూమిపై పెళ్లి చూశాను, స్వర్గంలో పెళ్లి జరుగుతుందని విన్నాను.. కానీ ఇదే తొలిసారి గాల్లో ప్రేమ ఫలించింది అంటూ ఒకరు రాశారు. వారి జీవితం కూడా ఇలాగే అందంగా ఉండాలని మరో వ్యక్తి కామెంట్‌ చేశారు. జీవితం ఇలాగే అందంగా ఉండాలని పలువురు ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..