Viral Video: రెండు బెలూన్ల మధ్య ఆకాశంలో నడక.. సాహసం మామూలుగా లేదుగా..!

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని సాహస వీడియోలు కూడా ఉంటాయి. ఇలాంటి వీడియోలని నెటిజన్లు బాగా ఆదరిస్తారు.

Viral Video: రెండు బెలూన్ల మధ్య ఆకాశంలో నడక.. సాహసం మామూలుగా లేదుగా..!
Man Walking

Updated on: Apr 08, 2022 | 5:44 PM

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని సాహస వీడియోలు కూడా ఉంటాయి. ఇలాంటి వీడియోలని నెటిజన్లు బాగా ఆదరిస్తారు. ఎందుకంటే ఇవి నమ్మలేకుండా ఉంటాయి. అంతేకాదు కొన్ని సాహస వీడియోలు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కినవి కూడా ఉంటాయి. అందుకే జనాలు ఇలాంటి వీడియోలని చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతారు. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ వీడియో గిన్నిస్‌ బుక్‌లో కూడా నమోదైంది. ఇంతకీ ఆ వీడియో సంగతేంటో తెలుసుకుందాం. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి ఆకాశంలో రెండు హాట్‌ ఎయిర్ బెలూన్ల మధ్య కాళ్లకి చెప్పులు లేకుండా ఒక తాడుపై నడవడం మనం వీడియోలో చూడవచ్చు. అలా తాడుపై బ్యాలెన్స్‌ ఆపుకుంటూ నడవడం మామూలు విషయం కాదు. మేఘాలలో అతడు చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ వీడియో గిన్నీస్‌ బుక్‌లో నమోదైంది.

తాడుపై నడిచిన ఆ వ్యక్తి పేరు రాఫెల్ జుగ్నో బ్రిడి. అతను 6,236 అడుగుల ఎత్తులో ఈ ఫీట్‌ సాధించాడు. ఒక హాట్ ఎయిర్ బెలూన్ నుంచి మరొక బెలూన్‌కు చేరుకోవడానికి రాఫెల్ తాడుపై జాగ్రత్తగా అడుగులు వేయడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 76 వేల కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రాఫెల్ జుగ్నో బ్రిడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ సాహసం చేయడం ఎవరి వల్ల కాదని కామెంట్స్‌ చేస్తు్న్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

Viral Video: ట్రాలీ నుంచి కిందపడబోయాడు.. కానీ కారు డ్రైవర్ దేవుడిలా వచ్చాడు..!

Kitchen vastu: వంటగది వాస్తు నియమాలు పాటించకపోతే ఇంట్లో ఈ అనర్థాలు తప్పవు..!

IPL 2022: రిషబ్‌ పంత్‌ ఆటతీరుపై తీవ్ర విమర్శలు.. కెప్టెన్ అయ్యాక విఫలమవుతున్నాడు..!