
పాములు అంటే దాదాపు చాలా మందికి భయం. దూరం నుండి పామును చూసినా కూడా పారిపోతారు. పాములకు భయపడేవారు కొందరు ఉండగా, మరికొంత మంది ఏం భయం లేకుండా తమ చేతులతో పట్టుకునే వారు ఉన్నారు. తాజాగా ఓ ఇంటి పైకప్పుపై పెద్ద నాగుపాము పడగవిప్పి బుసలు కొట్టింది. అది దాదాపు 5 అడుగుల పొడవుంది. అయితే ఓ పెద్ద మనిషి ఏ మాత్రం భయం లేకుండా ఇంటి పైకి ఎక్కి ఆ పామును పట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జర్నలిస్ట్ ఆంటోనీ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ.. “చిక్కబుడిహాలాలోని ఒక ఇంటిపై కూర్చున్న నాగుపాము సురక్షితంగా పట్టుబడింది” అని క్యాప్షన్ ఇచ్చారు. వైరల్ అవుతున్న ఒక వీడియోలో 5 అడుగుల పొడవైన నాగుపాము ఒక ఇంటి పైకప్పుపై కూర్చుని ఉన్నట్లు చూడవచ్చు. అప్పుడు ఓ పెద్దాయన పైకప్పుపైకి ఎక్కి పామును రక్షించారు. కానీ చాలా మంది పామును ఇంత అశాస్త్రీయంగా పట్టుకుని నొప్పి కలిగించడం తప్పు అని అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి