Viral Video: నీ స్టంట్‌ బొందలవడ… అనవసరంగా పోరడు పోతుండె గదరా… సోషల్‌ మీడియాలో స్టన్నింగ్‌ వీడియో

సోషల్‌ మీడియాలో అందుబాటులోకి వచ్చాక అనేక మంది రీల్చ్‌ పిచ్చిలో మునిగి తేలుతున్నారు. రకరాకల రీల్స్‌ చేస్తూ ఇంటర్నెట్‌లో అపలోడ్‌ చేస్తున్నారు. రాత్రికి రాత్రి ఫేమ్‌ అయిపోవాలనే ఆశతో ప్రమాదకర స్టంట్ష్ చేయడానికి కూడా వెనుకడటం లేదు. ఈ ప్రయత్నంలో అనేక మంది ప్రాణాలు...

Viral Video: నీ స్టంట్‌ బొందలవడ... అనవసరంగా పోరడు పోతుండె గదరా... సోషల్‌ మీడియాలో స్టన్నింగ్‌ వీడియో
Amazing Stunt On His Bike

Updated on: Aug 07, 2025 | 8:03 PM

సోషల్‌ మీడియాలో అందుబాటులోకి వచ్చాక అనేక మంది రీల్చ్‌ పిచ్చిలో మునిగి తేలుతున్నారు. రకరాకల రీల్స్‌ చేస్తూ ఇంటర్నెట్‌లో అపలోడ్‌ చేస్తున్నారు. రాత్రికి రాత్రి ఫేమ్‌ అయిపోవాలనే ఆశతో ప్రమాదకర స్టంట్ష్ చేయడానికి కూడా వెనుకడటం లేదు. ఈ ప్రయత్నంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అంతే కాదు ఆ స్టంట్‌తో సంబంధం లేని ఇతురులకు కూడా గాయాలపాలు చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రమాదకరమైన స్టంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

స్టంట్ అనేది ఒక గేమ్ అని చెబుతారు. స్టంట్‌ సరిగ్గా వస్తే ఎవరినైనా సులభంగా ఆకట్టుకోవచ్చు అని ప్రలోభపడతారు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియలో ఒక వ్యక్తి బైక్ ఎక్కి స్టంట్స్ చూపించడానికి ప్రయత్నిస్తుంంటాడు. అతను ముందు నుండి బైక్ మీద కూడా నిలబడి ఉంటాడు. అయితే, చివరికి, ప్రజలు అతన్ని చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. దాంతో ఆ వ్యక్తి మరింత రెచ్చిపోయి రెండు చేతులు వదిలేసి బైక్‌ రన్నింగ్‌లో ఉండగానే దానిపై నిలబడతాడు. సరిగ్గా అదే సమయంలో హఠాత్పరిణామం జరిగింది.

వీడియో చూడండి:

వీడియోలో, ఒక యువకుడు రోడ్డుపై కదులుతున్న బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. తన ఫీట్‌ను మరింత ప్రమాదకరంగా మార్చడానికి, అతను తన బైక్‌పై నిలబడి అకస్మాత్తుగా దానిపైకి దూకుతాడు. ఇదంతా చాలా మంది పిల్లలు రోడ్డు పక్కన నిలబడి అతన్ని చూస్తుండగా జరుగుతుంది మరియు చివరికి బైక్ రోడ్డుకు ఒక వైపుకు తిరిగి అక్కడ నిలబడి ఉన్న పిల్లవాడిని ఢీకొంటుంది. దీని కారణంగా ఆ పిల్లవాడు బైక్‌తో పాటు పొలంలో పడిపోతాడు. అతని ఆట అక్కడితో ముగుస్తుంది.

వేలాది మంది నెటిజన్స్‌ ఈ వీడియోపై రియాక్ట్‌ అయ్యారు. అందుకే ఆలోచించకుండా స్టంట్స్ చేయకూడదని ఒక యూజర్ రాశారు. మరొకరు బ్రదర్, ఏదైనా చెప్పు, ఈ వ్యక్తి మూర్ఖుడని నిరూపించుకున్నాడు అని రాశారు.