Viral Video: ఇదేం డ్రైవింగ్‌రా బాబు.. కొంచెముంటే ప్రాణాలు పోయేవి..!

|

Apr 25, 2022 | 11:22 AM

Viral Video: రోడ్డు మీద నడిచినా, కారులో నడిచినా సురక్షితంగా నడవడం చాలా ముఖ్యం. నేటి కాలంలో ప్రజలు రోడ్లపై విచక్షణ రహితంగా వాహనాలను నడుపుతున్నారు.

Viral Video: ఇదేం డ్రైవింగ్‌రా బాబు.. కొంచెముంటే ప్రాణాలు పోయేవి..!
Viral Video
Follow us on

Viral Video: రోడ్డు మీద నడిచినా, కారులో నడిచినా సురక్షితంగా నడవడం చాలా ముఖ్యం. నేటి కాలంలో ప్రజలు రోడ్లపై విచక్షణ రహితంగా వాహనాలను నడుపుతున్నారు. ప్రమాదాల కేసులు కూడా నిరంతరం పెరుగుతున్నాయి. భారతదేశంలోనే ప్రతి సంవత్సరం వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందుకే రోడ్ల మీద నడిచేటప్పుడూ వాహనాలని గమనించి జాగ్రత్తగా నడవాలి. లేదంటే ఎక్కడి నుంచి ఏ వాహనం వచ్చి ఢీ కొంటుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది. ఇది చూస్తే మీరు కూడా నవ్వుకుంటారు.

వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిచ్చెన పట్టుకొని ఉండటం మనం గమనించవచ్చు. ఆ నిచ్చెన ఎలక్ట్రిక్ స్తంభానికి ఆనుకొని ఉంది. దానిపై ఒక వ్యక్తి ఏదో పనిచేస్తున్నాడు. ఇంతలో ఊహించని పరిణామం ఎదురైంది. ఒక బైక్‌ రైడర్‌ వేగంగా వచ్చి నిచ్చెన పట్టుకొని ఉన్న వ్యక్తిని ఢీ కొడుతాడు. దీంతో ఆ వ్యక్తి రోడ్డు కిందకి పడిపోతాడు. నిచ్చెన విడిచిపెట్టడంతో పైన పనిచేస్తున్న వ్యక్తి కూడా కిందపడిపోతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. అలాగే బైక్‌ రైడర్‌పై మండిపడుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోని ఒక నెటిజన్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీనికి ఇప్పటివరకు 1.4 మిలియన్లు అంటే 14 లక్షల వ్యూస్‌ వచ్చాయి. అయితే 70 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

Migraine: ఈ కారణాల వల్ల మైగ్రేన్‌ వేధిస్తుంది.. అవేంటో తెలుసుకోండి..

Heat Stroke: హీట్‌స్ట్రోక్‌ నివారించడానికి ఆయుర్వేద మార్గాలు ఇవే..!

Indian Foods: ఈ భారతీయ ఆహారాలు అద్భుతమైనవి.. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు..!

మరిన్ని వైరల్‌ వీడియోలకి ఇక్కడ క్లిక్ చేయండి