సాహసాలు చేసేందుకు ఆసక్తి చూపే వారు ఎలాంటి భయం, సంకోచం లేకుండా ప్రమాదకరమైన విన్యాసాలు అలవోకగా చేసేస్తుంటారు. చూసే వారికి మాత్రం ‘వీళ్లసలు మనుషులేనా..? ఇలాంటి స్టండ్స్ ఎలా చేస్తార్రా బాబూ..!’ అంటూ మనసులోనే తెగ తిట్టేసుకుంటారు. చూసినందుకే దాదాపు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనిచేస్తారు. రకరకాల స్టంట్లకు సంబంధించిన వివిధ వీడియోలు దాదాపు ప్రతి రోజూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. అలాంటి వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యాడో.. ఏమో.. తెలియదు గానీ ఓ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ వీడియోలో ఏముందంటే..
ఓ వ్యక్తి తాడు సహాయంతో ఎత్తైన స్కైస్క్రాపర్ దూకేందుకు సిద్ధమయ్యాడు. మరో వ్యక్తి (ఇన్స్ట్రక్టర్) అతడిని దాదాపు ఆకాశంలో వేలాడదీశాడు. ఇన్స్ట్రక్టర్ అంచున నిలబెట్టి తాడు కొస పట్టుకుని విడిచిపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆకరి నిమిషంలో ఏమనుకున్నాడో ఏమో తెలియదు గానీ మనోడు భయంతో హడలెత్తిపోయాడు. తనను పైకి లాగాలని, ఈ స్టంట్ చేయనని వేడుకున్నాడు. అయినా పట్టించుకోని ఇన్స్ట్రక్టర్ అతడిని నెమ్మదిగా నెమ్మదిగా క్రిందికి తోసేయడం వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో స్టంట్ చేస్తున్న వ్యక్తి అతన్ని వేడుకోవడం వీడియోలో కనిపిస్తుంది. ఇంతలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వ్యక్తి తన చేతిలోని తాడును విడిచిపెడతాడు. ఆ తర్వాత అతను ఒక్కసారిగా కిందకు పడిపోతాడు. నేలకు.. ఆకాశానికి మధ్యలో వేలాడటం వీడియోలో చూడొచ్చు. ఈ దృశ్యం చూసేవారికి ఎవరికైనా గూస్బంప్ తెప్పిస్తుంది.
It’s too late to change your mind pic.twitter.com/rcX0OpfUPx
— internet hall of fame (@InternetH0F) May 8, 2024
ఇక ఈ వీడియోInternetH0F అనే యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేవలం 21 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ వీక్షణలు, లక్షల్లో లైకులు, కామెంట్లు రావడంతో సామాజిక మాధ్యమాల్లో వైలర్గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న విధాలుగా స్పందిస్తు్న్నారు. ఇంత ప్రమాదకరమైన ఫీట్ చేశాడు.. ‘ఈ వ్యక్తి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే’ అంటూ నెటిజన్లు కామెంట్ సెక్షన్లో అభినందిస్తున్నారు. ‘ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ ఎవరైనా ఇష్టపూర్వకంగా ఎలా చేయగలరో నాకు అర్థం కాలేదు’, ‘వీటి వల్ల ఏంటిరా లాభం..?’, ‘లక్ష రూపాయలు ఇచ్చినా ఈ స్టంట్ ఎప్పటికీ చేయను’ అంటూ పలువురు కామెంట్ సెక్షన్లో పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ కథనాల కోసం క్లిక్ చేయండి.