Viral Video: రోడ్డుపై పోలీసుతో ఆడుకున్నారు.. ఇది చూసిన నెటిజనం సోషల్ మీడియాలో షేర్ కొడుతున్నారు.. ఎందుకో..

మన దేశంలో క్రికెట్ అంటే చాలా ప్రాణం. భారతదేశంలో ఈ ఆటకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఆబాల గోపాలాన్ని  ఆటగాళ్లుగా...

Viral Video: రోడ్డుపై పోలీసుతో ఆడుకున్నారు.. ఇది చూసిన నెటిజనం సోషల్ మీడియాలో షేర్ కొడుతున్నారు.. ఎందుకో..
Policeman Playing Cricket

Updated on: Aug 26, 2021 | 11:28 AM

మన దేశంలో క్రికెట్ అంటే చాలా ప్రాణం. భారతదేశంలో ఈ ఆటకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఆబాల గోపాలాన్ని  ఆటగాళ్లుగా మార్చేస్తుంది. చిన్న పిల్లలు నుంచి పెద్దల వరకు క్రికెట్‌పై మోజు ఎక్కువ. అంతే కాదు క్రికెట్ ఆడేందుకు పెద్ద గ్రౌండ్, స్టేడియం అంటూ అవసరం లేదు ఎక్కడైనా.. ఎప్పుడైనా సరదాగా ఆడేస్తుంటారు మన భారతీయులు. ఆ మధ్య కరోనా వ్యాప్తి సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారడంతో డ్యూటీలో ఉన్న పోలీసులు రోడ్లపై క్రికెట్ ఆడటం మనం చాలా సార్లు చూశాం. అయితే ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక పోలీసు అటుగా వచ్చిన బైకర్లతో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీధి క్రికెట్ ఆడుతున్న వివిధ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పోలీసు బ్యాటింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో బైకర్లు పోలీస్‌తో కలిసి బౌలింగ్ చేస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తోంది. రోడ్డుపై ఆడుకుంటున్న పోలీసులను చూసి ఇతర బైకర్లు కూడా బైక్‌ను పక్కకు పెట్టి ఆడుకోవడం ప్రారంభించారు. ఈ పోలీసు ప్రత్యేక విధానాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు.

ఈ వీడియోకి సోషల్ మీడియాలో చాలా లైక్స్ వస్తున్నాయి.  ఈ వీడియో Instagram లో wanderlost_india అనే పేజీలో భాగస్వామ్యం చేయబడింది. ఈ వీడియో ఇప్పటివరకు 72 వేలకు పైగా వీక్షించబడింది. ఈ వీడియోను ప్రజలు నిజంగా ఇష్టపడుతున్నారు.

ప్రజలు ఈ వీడియోను ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. కానీ దానికి భిన్నంగా రియాక్షన్ వస్తోంది. పోలీసు బ్యాటింగ్ చేయడాన్ని నెటిజన్లు చాలా లైక్ చేస్తున్నారు. ప్రజలు వీధిలో క్రికెట్ ఆడుతున్నట్లు చాలాసార్లు చూశాం.. కానీ పోలీసులు ఇలా ఆడటం చూడటం ఇదే మొదటిసారి అని అంటున్నారు యూజర్లు.

ఇవి కూడా చదవండి: Viral Video: హడావిడిగా రైల్వే గేట్ దాటడానికి ప్రయత్నించాడు.. అప్పుడేం జరిగిందో చూస్తే.. మీరు కూడా ఆశ్చర్యపోతారు..

Hair Smuggling: వెంట్రుకలే కదా అని తీసిపడేయకండీ.. ఆ కురులే వారిని కుబేరులను చేస్తున్నాయి.. ఇది ఎలానో తెలుసుకోండి..