Viral Video: కచ్చా బాదం సాంగ్‌కు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో.. అద్భుతమైన డాన్స్‌ చేసిన లిటిల్ గర్ల్.. నెట్టింట్లో వైరల్

|

Mar 04, 2022 | 9:46 AM

Viral Video: కచ్చా బాదం సాంగ్(Kacha Badam song)ప్రస్తుతం ఏ రేంజ్ లో ట్రెండ్‌ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. దేశ విదేశాల సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ కచ్చా బాదం సాంగ్ కు ఫిదా..ఈ సాంగ్ ఇంటర్నెట్‌ లో..

Viral Video: కచ్చా బాదం సాంగ్‌కు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో.. అద్భుతమైన డాన్స్‌ చేసిన లిటిల్ గర్ల్.. నెట్టింట్లో వైరల్
Video Viral
Follow us on

Viral Video: కచ్చా బాదం సాంగ్(Kacha Badam song)ప్రస్తుతం ఏ రేంజ్ లో ట్రెండ్‌ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. దేశ విదేశాల సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ కచ్చా బాదం సాంగ్ కు ఫిదా..ఈ సాంగ్ ఇంటర్నెట్‌ లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ పెప్పీ బీట్‌కు పాదం కలుపుతున్నారు. ఈ  బెంగాలీ పాట (Bengali Song) ఇంటర్నెట్‌లో తుఫానుగా మారడమే కాదు.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ  కచ్చా బాదం సాంగ్ కు ఓ చిన్నారి  అద్భుతమైన డ్యాన్స్‌ చేసింది…. అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ వీడియోలో చిన్నారి చిట్టి తల్లి .. కచ్చా బాదం బెంగాలీ పాటకు ఉత్సాహంగా స్టెప్స్ వేసింది. చిన్నారి అభినయం, డ్యాన్స్ఆ స్టెప్స్ వేసిన విధానం చూపరులను ఆకట్టుకుంటుంది. చిన్నారి హుక్ స్టెప్ వేస్తున్నప్పుడు.. నాట్యం చేస్తున్న సమయంలో చూస్తున్న చుట్టుపక్కల ప్రజలు ఈలలు వేస్తూ.. చప్పట్లు కొట్టి.. ఉత్సాహపరిచారు. చాలా మంది చిన్నారి డ్యాన్స్‌ను తమ మొబైల్ ఫోన్‌లలో బంధించారు.

ఈ వీడియోను “రోక్లో సాహెబ్”  వీడియో క్యాప్షన్ తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఘంటా అనే పేజీలో షేర్ చేశారు.

ఈ వీడియో 2.6 లక్షలకు పైగా లైక్‌లు, అనేక కామెంట్స్ ను సొంతం చేసుకుంది. డ్యాన్స్ చేసిన  ఈ చిన్నారి నేపాల్‌కు చెందినదని తెలుస్తోంది. ఈ చిన్నారి డ్యాన్స్ పై నెటిజన్లు హార్ట్  ఎమోజీలతో పాటు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  చిన్నారి వరుణ్ ధావన్ , కత్రినా కైఫ్ ల కంటే మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తోందని కామెంట్ చేశాడు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్ అనే వేరుశెనగ విక్రేత తన వేరుశెనగలను విక్రయించడానికి సూపర్ క్యాచీ జింగిల్‌ను కంపోజ్ చేశాడు. ఈ కచ్చా బాదం సాంగ్ రాత్రికి రాత్రే ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. ప్రముఖ సంగీతకారుడు నజ్ము రీచాట్ ఈ పాటను రీమిక్స్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌ లో చేశాడు.  దీంతో అనేక మంది సెలబ్రెటీలు ఈ సాంగ్ కు రీల్స్ చేయడం ప్రారంభించారు.

Also Read:

తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వ్యత్యాసం.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..