Trending Video: పాములు అంటే నూటికి 90 శాతం మంది భయపడతారు. అది కనపడగానే ఆమడదూరం పరిగెడతారు. ఇంకొందరైతే పాము వీడియోలు చూడాలన్నా బెరుకు చూపుతారు. అయితే కొందరు మాత్రం పాములతో, బొమ్మలతో ఆడుకున్నట్లు ఆడుకుంటారు. తాజాగా ఓ బాలిక పాముతో ఇంట్లో ఆడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న వీడియోలో.. ఒక బాలిక నలుపు రంగులో ఉన్న పొడవైన ప్రాణాంతకమైన కొండచిలువను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అది దూరంగా పారిపోతుంది. అయితే ఆ బాలిక మాత్రం ఆ పామును అక్కడి నుంచి వెళ్లనివ్వడం లేదు. కొన్ని వారాల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేక్‌మాస్టెరెక్సోటిక్స్ షేర్ చేసిన ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు 8 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ‘Loving this big girl’ అని క్యాప్షన్ ఇచ్చారు.
వీడియోను దిగువన చూడండి….
ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. కొండచిలువతో ఆడిన బాలిక ధైర్య హృదయాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు. ఈ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టారు. అది ఆ అమ్మాయి పెట్ అనుకుంట అని మరొకరు రాసుకొచ్చారు. చిన్నారికి ఎన్ని గుండెలు ఇంకొకరు వ్యాఖ్యానించారు.
Also Read: Telangana: ఆలయ ప్రహరీ పునాది తవ్వుతుండగా బయటపడ్డ పెట్టె.. ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్…