Viral Video: స్కూటర్‌ను ఢీకొట్టి.. ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. రోడ్డుపై నిప్పులు చెరుగుతూ ..

మార్చి 14న హోలీ రోజున 16 ఏళ్ల బాలిక తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్న బైక్‌ను కారు బలంగా ఢీకొట్టింది. సోషల్‌ మీడియా వైరల్‌ కావడంతో ఆదివారం డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. బాధితురాలు ముస్కాన్ హోలీ రోజున ఉదయం 11 గంటల ప్రాంతంలో తన స్నేహితుడు అమన్ శర్మతో కలిసి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన కారు వారి బైక్‌ను ఢీకొట్టింది.

Viral Video: స్కూటర్‌ను ఢీకొట్టి.. ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. రోడ్డుపై నిప్పులు చెరుగుతూ ..
Hit And Run

Updated on: Mar 25, 2025 | 6:29 PM

కోల్‌కతా రాజధాని లక్నో‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక లూలు మాల్ దగ్గర స్కూటర్‌ను ఓ కారు డ్రైవర్ ఢీకొట్టాడు. ప్రమాదంలో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు స్నేహితులు కిందపడిపోగా స్కూటర్ కారు కింద ఇరుక్కుపోయింది. అయితే డ్రైవర్ కారును ఆపకుండా అలాగే దూసుకెళ్లాడు. దీంతో కారు వెంబడి నిప్పురవ్వలు వ్యాపించాయి. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. దీంతో విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వీడియో ఇక్కడ చూడండి..

మార్చి 14న హోలీ రోజున 16 ఏళ్ల బాలిక తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్న బైక్‌ను కారు బలంగా ఢీకొట్టింది. సోషల్‌ మీడియా వైరల్‌ కావడంతో ఆదివారం డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. బాధితురాలు ముస్కాన్ హోలీ రోజున ఉదయం 11 గంటల ప్రాంతంలో తన స్నేహితుడు అమన్ శర్మతో కలిసి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికాలేదు. కానీ, వీడియో మాత్రం వేగంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..