
దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు పలు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రాజస్థాన్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, జమ్మూకశ్మీర్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఆజ్మీర్, కోటా, పాలి, జాలోర్, ధోల్పూర్ జిల్లాలు అతలాకుతలం అవతున్నాయి. రహదారులు, నివాసాలు నీట మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. కొన్నిచోట్ల గోడలు కూలిపోయాయి. చంబల్ నది పరివాహక ప్రాంతాల్లో.. అధిక వర్షపాతంతో నది పొంగిపొర్లుతోంది.
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో వీధులన్నీ నదులుగా మారిపోయియి. వీధుల వెంట వరదలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. మనుషులు, బైక్‌లు వీధుల వెంట కొట్టకెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#Rajasthan: Today’s Ajmer flash flood , where water submerged homes and floors . pic.twitter.com/ZKrg13gMEf
— CMNS_Media⚔️ #Citizen_Media🏹VEDA 👣 (@1SanatanSatya) July 18, 2025
అటు ఉత్తరప్రదేశ్‌లో భారీవర్షాలు కురుస్తున్నాయి.ఎగువన ఇంకా వర్షబీభత్సం కొనసాగుతుండడంతో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లోని కొన్ని ప్రాంతాలు ముంపు ముప్పులోనే ఉన్నాయి. ఉధృతి ఇంకా కొనసాగే ప్రమాదం ఉండడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలకు నిలిచిపోయాయి.