Viral Video: ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ధైర్యం!.. ఈ అమ్మాయి వీడియో చూస్తే ఫ్యూజుల్ ఔట్..!

|

Apr 09, 2022 | 10:06 PM

Viral Video: పాము చెలగాటం అంటే ప్రాణాలను చెలగాటం ఆడినట్లేనని చెప్పాలి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాము ఒకటి.

Viral Video: ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ధైర్యం!.. ఈ అమ్మాయి వీడియో చూస్తే ఫ్యూజుల్ ఔట్..!
Viral
Follow us on

Viral Video: పాము చెలగాటం అంటే ప్రాణాలను చెలగాటం ఆడినట్లేనని చెప్పాలి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాము ఒకటి. వాటిలో కింగ్ కోబ్రా మరీ డేంజర్ అని చెప్పాలి. సింహం, పులుల బారి నుంచైనా తప్పించుకుని బతుకొచ్చు గానీ.. కింగ్ కోబ్రా కాటేస్తే నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే కింగ్ కోబ్రా కనిపిస్తే చాలు జనాలు హడలిపోతుంటారు. ఇక చిన్నపాటి బొద్దింకను చూస్తేనే జడుసుకునే అమ్మాయిలు ఉన్నారు ప్రస్తుత కాలంలో. అలాంటిది పామును చూస్తే ఇంకేమైనా ఉందా? దడుసుకుని జ్వరం తెచ్చుకుంటారు. కానీ, కొందరు మాత్రం పాములతో సరదాగా ఆడుకుంటారు. అదేదో ఆట బొమ్మ అయినట్లు.. వాటిన పట్టుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ సరదాగా ఉంటారు. తాజాగా అలాంటి షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది కూడా ఒక అమ్మాయి కింగ్ కోబ్రాతో సరదాగా ఆడుకుంటోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. మైదాన ప్రాంతంలో ఓ భారీ కింగ్ కోబ్రా ఉంది. దాని పక్కనే ఓ యువతి కూడా ఉంది. అలా దాని పక్కనే కూర్చుని.. ఆ కోబ్రాకు మూతికి సరదాగా ముద్దు పెట్టింది. అమ్మాయి ముద్దు పెడుతున్న సమయంలో కోబ్రా ఏమాత్రం కదలకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. కోబ్రా ఏమనకపోవడంతో.. ఆ యువతి దానిని రెండుసార్లు కిస్ చేసింది. దీనిని కెమెరాలో రికార్డ్ చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్ rasal_viper లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. కొందరు యువతి ధైర్యసాహసాలను ప్రశంసిస్తుంటే.. మరికొందరు హెచ్చరికలు ఇస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని సూచిస్తున్నారు. పొరపాటు పాము కాటేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 5.27 లక్షలకు పైగా వ్యూస్ రాగా, 12 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

Also read:

Railway Recruitment 2022: నెలకు 25 వేలకు పైగా జీతం.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. పూర్తి వివరాలివే..

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ దిశలో డబ్బులు అస్సలు పెట్టొద్దు.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..!

Viral Video: బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్‌.. సీన్ కట్ చేస్తే.. మీరే ఓ లుక్కేయండి..!