Viral Video: అమెజాన్‌ అడవుల్లో అనకొండ హల్‌చల్‌… అచ్చం హాలీవుడ్‌ సినిమా లెక్కనే..

అనకొండ.. ఈ పేరు వింటేనే ఒల్లు జలదరిస్తుంది. ఇప్పటి వరకు భూమిపై కనిపించిన పాముల్లో కెల్లా అతి పెద్ద పాము ఇదేనని చెబుతారు. మనుషులను కరవడం కాదు.. ఏకంగా ఒక్క గుట్కతో మింగేస్తుంది. అనకొండ విశ్వరూపాన్ని చూపిస్తూ చాలా హాలీవుడ్‌ సినిమాలు కూడా వచ్చేశాయి. అలాంటి అనకొండ నిజంగానే మన కళ్లముందు...

Viral Video: అమెజాన్‌ అడవుల్లో అనకొండ హల్‌చల్‌... అచ్చం హాలీవుడ్‌ సినిమా లెక్కనే..
Anakonda In Amazon

Updated on: May 12, 2025 | 4:35 PM

అనకొండ.. ఈ పేరు వింటేనే ఒల్లు జలదరిస్తుంది. ఇప్పటి వరకు భూమిపై కనిపించిన పాముల్లో కెల్లా అతి పెద్ద పాము ఇదేనని చెబుతారు. మనుషులను కరవడం కాదు.. ఏకంగా ఒక్క గుట్కతో మింగేస్తుంది. అనకొండ విశ్వరూపాన్ని చూపిస్తూ చాలా హాలీవుడ్‌ సినిమాలు కూడా వచ్చేశాయి. అలాంటి అనకొండ నిజంగానే మన కళ్లముందు కనపడితే ఎలా ఉంటుంది? ఎలా ఉండటమేంటి పై ప్రాణాలు పైనే పోవడం మాత్రం ఖాయం. ఈ భూమి మీద అతిపెద్ద అనకొండగా భావించే ఓ భారీ పామును ఇటీవల ఈక్వెడార్‌లో కనిపించింది. తాజాగా అమెజాన్ అడవుల్లోనూ మరో భారీ అనకొండను గుర్తించారు.

అమెజాన్ అడవులు చాలా దట్టంగా ఉంటాయి. అమెజాన్‌ అడవి మధ్య నుంచి పారుతున్న నదిలో ఓ భారీ అనకొండ ఈదుకుంటూ వెళ్లే వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోను హెలీకాఫ్టర్ నుంచి చిత్రీకరించినట్లు స్పష్లమవుతోంది. నదిలో అనకొండ ఈదుకుంటూ వెళుతున్న దృశ్యం నెటిజన్స్‌ను ఆకటుకుంటోంది. ఎంతో దూరం నుంచే చూస్తేనే ఆ అనకొండ నదిలో ఎంతో పెద్దగా కనిపిస్తోంది. ఇక దగ్గరి నుంచి చూస్తూ ఇంకా ఎంత పెద్దగా ఉంటుందో మరి.

అంత భారీ అనకొండ నీటిలో మాత్రం వేగంగా ఈదుతూ ఉంది. దాని భారీ ఆకారాన్ని దగ్గరి నుంచి చూస్తే గుండె ఆగాల్సిందే. ఇక వీడియోను చూసిన నెటిజన్స్‌ రకరాలుగా కామెంట్స్‌ పెడుతున్నారు. హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు ఉందని పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్స్ మధ్య భిన్న వాదనలు జరుగుతున్నాయి. ఇది ఫేక్ వీడియో కావొచ్చని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.

 

వీడియో చూడండి: