
దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినవి లేదంటే స్థానికులు ఎవరైనా తమ ఫోన్లలో రికార్డ్ చేసిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. పోలీసు విచారణలో ఒక్కోసారి అవే వీడియోలు కీలకంగా మారుతుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వేగంగా వ్యాపిస్తోంది.
ఫ్లోరిడా రెస్టారెంట్‌లో జరిగిన ఓ గొడవకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాయువ్య మయామిలో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. డబ్బు ఇవ్వడానికి నిరాకరించిన తర్వాత మహిళ మరొకరిపై కత్తితో దాడి చేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
వాయువ్య మయామిలోని ఫ్రిటాంగా పినోలాండియా లోపల నుండి సీసీటీవీ వీడియోలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనలో నిందితురాలని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఒక మహిళ మరొకరిని డబ్బు అడిగి తిరస్కరించడంతో ఘర్షణ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఆ మహిళ పై అవయవాలకు అనేక గాయాలు అయ్యాయని, ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు సహాయకులు తెలిపారు.
ఈ హఠాత్పరిణామానికి రెస్టారెంట్ కస్టమర్లు షాక్ తిన్నారు, భయాందోళన చెందారని యజమాని తెలిపారు.
Una mujer es apuñalada por otra en restaurante nicaragüense Fritanga Pinolandia en Miami.
El dueño del restaurante nicaragüense dijo que una de las mujeres sacó una tijera y le asestó varias puñaladas a su víctima.
🌐Más detalles: https://t.co/xVMsfK5kUx pic.twitter.com/D43RlOcklT
— LA PRENSA Nicaragua (@laprensa) November 27, 2025