Vira Vedeo: కోర్టు హాలులో పొట్టుపొట్టు కొట్టుకున్న లాయర్లు… కారణం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్స్‌

న్యాయవాది విధి ఏంటని చిన్న పిలగాడిని అడిగినా కేసులు వాదించడం అని టక్కున సమాధానం చెబుతాడు. కానీ అక్కడి న్యాయవాదులు మాత్రం కోర్టులో వాదనలు ఆపి పొట్టుపొట్టు కొట్టుకున్నారు. కోర్టు లోపల రెండు గ్రూపులకు చెందిన న్యాయవాదులు పరస్పరం దాడి చేసుకున్న సంఘటన...

Vira Vedeo: కోర్టు హాలులో పొట్టుపొట్టు కొట్టుకున్న లాయర్లు... కారణం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్స్‌
Lawyers Fighting In Court H

Updated on: Apr 17, 2025 | 8:34 PM

న్యాయవాది విధి ఏంటని చిన్న పిలగాడిని అడిగినా కేసులు వాదించడం అని టక్కున సమాధానం చెబుతాడు. కానీ అక్కడి న్యాయవాదులు మాత్రం కోర్టులో వాదనలు ఆపి పొట్టుపొట్టు కొట్టుకున్నారు. కోర్టు లోపల రెండు గ్రూపులకు చెందిన న్యాయవాదులు పరస్పరం దాడి చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ కృష్ణ నగర్‌లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు లోపల ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది.

ఒక వివాదంపై న్యాయవాదులు కోర్టు లోపల భౌతిక ఘర్షణకు దిగారు. ఈ సంఘటన కెమెరాలో రికార్డైంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోర్టు లోపల పురుష, మహిళా న్యాయవాదులు ఒకరినొకరు చెప్పులు మరియు నేమ్ ప్లేట్‌తో కొట్టుకుంటున్నట్లు వీడియోలో చూడవచ్చు. న్యాయవాదులు కోర్టులో కక్షిదారులను తీసుకురావడంపై ఒకరినొకరు తిట్టుకున్నారు. హత్యాయత్నం, దోపిడీ సెక్షన్ల కింద ఇరువర్గాలపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.

 

వీడియో చూడండి:

 

 

క్లయింట్లను సంపాదించుకోవడంలో వివాదం తర్వాత రెండు గ్రూపుల న్యాయవాదుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. న్యాయవాదుల మధ్య వాదన పెరిగి, వారి మధ్య శారీరక ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. మహిళా న్యాయవాదులు కూడా ఈ కొట్లాటలో పాల్గొనడం ఆసక్తిగా మారింది. మహిళా న్యాయవాదులలో ఒకరు మరొకరిని చెప్పుతో కొడుతున్నట్లు వీడియో చూపిస్తుంది.

పురుష న్యాయవాదులలో ఒకరు మరొకరిని స్టీల్ నేమ్ ప్లేట్‌తో కొట్టారని, ఫలితంగా వ్యక్తికి తీవ్ర రక్తస్రావం జరిగిందని కూడా వీడియోలో చూపిస్తుంది. నేల అంతా రక్తం చిందినట్లు కూడా కనిపిస్తుంది. ఒక మహిళా న్యాయవాదికి కూడా రక్తస్రావం అవుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.