Viral Video: షాకింగ్ ఘటన.. సోఫాలోంచి లేస్తుండగా నడుములో పేలిన పిస్టల్… ఆసుపత్రికి తరలిస్తుండగానే ఎన్నారై…

గన్‌ మిస్‌ ఫైర్‌ అయిన సంఘటనలు తరచుగా వింటూనే ఉంటాం. ప్రాణాలు కూడా పోయిన ఘటనలు ఉన్నాయి. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా సోమవారం సాయంత్రం పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో నడుముకు పెట్టుకున్న పిస్టల్ అనుకోకుండా పేలడంతో జరిగిన ఓ విషాదకరమైన ప్రమాదంలో...

Viral Video: షాకింగ్ ఘటన.. సోఫాలోంచి లేస్తుండగా నడుములో పేలిన పిస్టల్... ఆసుపత్రికి తరలిస్తుండగానే ఎన్నారై...
Gun Misfires

Updated on: Jan 03, 2026 | 3:28 PM

గన్‌ మిస్‌ ఫైర్‌ అయిన సంఘటనలు తరచుగా వింటూనే ఉంటాం. ప్రాణాలు కూడా పోయిన ఘటనలు ఉన్నాయి. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా సోమవారం సాయంత్రం పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో నడుముకు పెట్టుకున్న పిస్టల్ అనుకోకుండా పేలడంతో జరిగిన ఓ విషాదకరమైన ప్రమాదంలో ఒక ఎన్నారై ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ధాని సుచా సింగ్ గ్రామంలో జరిగింది, ఇక్కడ హర్విందర్ సింగ్ అలియాస్ సోను ఇటీవల విదేశాల నుండి తిరిగి వచ్చి తన కుటుంబంతో స్థిరపడ్డారు.

హర్విందర్‌కు భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన జరిగినప్పుడు బంధువులతో కలిసి సోఫాలో కూర్చుని ఉన్నారు. పోలీసుల ప్రకారం, సీసీటీవీ ఫుటేజీలో అతని నడుముకు లోడ్ చేసిన రివాల్వర్ పెట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. హర్విందర్ సోఫాలోంచి లేవగానే, పిస్టల్ అకస్మాత్తుగా పేలింది. బుల్లెట్ అతని కడుపులోకి దిగింది. తీవ్ర గాయాలతో అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఆ తర్వాత బఠిండాకు రిఫర్ చేశారు.

అయితే, మార్గమధ్యలోనే హర్విందర్‌ గాయాలతో మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వీడియో చూడండి: