
రోడ్డుపై భారీగా వాహనాలు దూసుకుపోతున్నాయి. ఇంతలో రోడ్డుపైకి రెండు బాతులు పిల్లలతో పాటు వచ్చాయి. వాటిని చూడగానే వేగంగా దూసుకెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయాయి. రోడ్డు దాటేంత వరకూ వాహనదారులు ముందుకు వెళ్లలేదు. ఈ ఆసక్తికర సంఘటన పెర్త్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కోమోలోని కానింగ్ హైవేపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఇంతలో ఓ బాతుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. ఇది గమనించిన కొందరు వాహనదారులు తమ వాహనాలను ఒక్కసారిగా ఆపేశారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇంతలో ఆ బాతుల గుంపు ఎంచక్కా ఒకదాని వెనుక నడుస్తూ రోడ్డు దాటేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. కాగా, వాహనాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో పలు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరు కార్లు దెబ్బతిన్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వాహనదారులు ప్రవర్తించిన తీరును పశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
DUCKS ON FREEWAY – KWINANA FREEWAY NORTHBOUND AT CANNING HIGHWAY, COMO
Multiple lanes affected
Motorist out of vehicles
Motorists be aware and be alert
Traffic heavy back to Leach Highwayhttps://t.co/9PVfGLIBPN#perthtraffic #mainroadswa pic.twitter.com/A3RrRNI3FB— Main Roads WA (@Perth_Traffic) October 10, 2025