ప్రపంచంలోని జంతువులన్నికంటే అతి పెద్ద జంతువు ఏనుగు. కానీ చిన్న చీమకు కూడా భయపడిపోతుంది. ఇక ఏనుగుకు కూడా మనలాగే ఎమోషన్స్ ఉంటాయి.. నిదానంగా.. జాగ్రత్తగా ఎలాంటి శ్రమ కలగకుండా చూసుకుంటాయి. ఇక తమ పిల్ల ఏనుగులపై తల్లి ఏనుగులకు అమితమైన ప్రేమ ఉంటుంది.. ఇందుకు సంబంధించిన వీడియోలను మనం ఎప్పుడూ సోషల్ మీడియాలో చూస్తుంటాం. తన పిల్ల ఏనుగులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటుంటాయి. అయితే ఈ గున్న ఏనుగులు చేసే అల్లరి చేష్టలు.. ఆటలు నవ్వులు పూయిస్తుంటాయి. నీళ్లు.. మట్టిలో గెంతులేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటాయి.
ఇటీవల ఏనుగులు.. గున్న ఏనుగులకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గున్న ఏనుగుల అల్లరి పనులకు సంబంధించిన వీడియోలు నవ్వులు పూయిస్తుంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏనుగుల అల్లరి చేష్టలు చూసేందుకు ఇష్టపడుతుంటారు. తాజాగా ఓ తల్లి ఏనుగు… గున్న ఏనుగు చేసిన పనికి ఒక్కసారిగా జడుసుకుంది. భయంతో పరుగులు పెడుతూ.. తన బిడ్డ ప్రాణం కోసం తల్లడిల్లింది. అయితే ఆ గున్న ఏనుగు చేసిన పనికి మాత్రం మీరు కచ్చితంగా నవ్వుకుంటారు. ఇంతకీ ఆ పిల్ల ఏనుగు ఏం చేసిందో తెలుసుకుందామా.
ఆ వీడియోలో ఓ పిల్ల ఏనుగు పార్క్లో గాఢంగ నిద్రపోయింది. అయితే అక్కడకు వచ్చిన తల్లి ఏనుగు దానిని నిద్రలేపడానికి ప్రయత్నించింది. అయితే మంచి నిద్రలో ఉన్న ఆ పిల్ల ఏనుగు.. అసలు కదలలేదు. దీంతో తల్లి ఏనుగు ఒక్కసారిగా భయపడిపోయింది. అలా దానిని లేపడానికి అనేక రకాలుగా ప్రయత్నించి.. వెంటనే అక్కడే ఉన్న పార్క్ నిర్వాహకుల తీసుకువచ్చింది. అయితే వారు వచ్చి.. ఆ పిల్ల ఏనుగును కదపగా.. వెంటనే పిల్ల ఏనుగు ఉలిక్కిపడి లేచింది. దీంతో తల్లి ఏనుగు ఊపిరి పీల్చుకుంది. ఈ వీడియోను Buitengebieden అనే ట్విట్టర్ ఖాతా యూజర్ షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. అయితే పిల్ల ఏనుగు కోసం ఆ తల్లి ఏనుగు పడే తాపత్రాయం కాస్త ఎమోషనల్గా అనిపించిన.. ఆ గున్న ఏనుగు చేసిన పని చూస్తే మాత్రం నవ్వు రాకమానదు. ఆ ఫన్నీ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి..
ట్వీట్..
Mother elephant can’t wake her baby sound asleep and asks her keepers for help.. pic.twitter.com/6h0nzpB5IR
— Buitengebieden (@buitengebieden_) September 17, 2021
Also Read: Sandeep Kishan: జోరు పెంచిన యంగ్ హీరో.. మరో ప్రాజెక్ట్ షూరు చేసిన సందీప్ కిషన్..
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..