Viral Video: ఓరి నీ ‘టీ’ పిచ్చి తగలెయ్య.. చాయ్ కోసం నడిరోడ్డుపై బస్సు ఆపిన డ్రైవర్.. ఆ తరువాత సీన్ అద్దిరిపోయింది..

|

Jan 05, 2023 | 4:09 PM

చాలా మందికి టీ అంటే పిచ్చి. ఉదయం లేవగానే టీ తో రోజును ప్రారంభిస్తారు. మరికొందరైతే.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు 4, 5 సార్లైనా టీ తాగకుండా ఉండలేరు.

Viral Video: ఓరి నీ ‘టీ’ పిచ్చి తగలెయ్య.. చాయ్ కోసం నడిరోడ్డుపై బస్సు ఆపిన డ్రైవర్.. ఆ తరువాత సీన్ అద్దిరిపోయింది..
Tea Break
Follow us on

చాలా మందికి టీ అంటే పిచ్చి. ఉదయం లేవగానే టీ తో రోజును ప్రారంభిస్తారు. మరికొందరైతే.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు 4, 5 సార్లైనా టీ తాగకుండా ఉండలేరు. ఇక వర్షాకాలం, చలికాలంలో అయితే టీ లేకుండా పూట గడవదు. ఏ పని చేసుకోలేకపోతారు. అందుకే వెచ్చని ఓదార్పు కోసం కమ్మని టీ ని గుక్కున తాగేస్తుంటారు. టీ తాగడం వల్ల మంచి అనుభూతి చెందుతారు. టీ పేరున ఎన్నో సినిమా పాటలు కూడా వచ్చాయి. అయితే, తాజాగా టీ కి సంబంధించి సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

అవునుమరి.. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన ఓ బస్సు డ్రైవర్ టి తాగేందుకు నడిరోడ్డుపై బస్సును ఆపాడు. భారీ ట్రాఫిక్ జామ్ అవుతున్నా పట్టించుకోకుండా తనపాటికి తాను వెళ్లి టీ తెచ్చుకున్నాడు. బస్సులోని వారు, బస్సు కారణంగా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న వారు ఎత్త మొత్తుకున్నా పట్టించుకోలేదు. నింపాదిగా వెళ్లి రోడ్డు అవతలి వైపున ఉన్న టీ కొట్టులో టీ తీసుకున్నాడు. అయితే, అక్కడే తాగకుండా చేతిలో పట్టుకుని వెళ్లాడు. బస్ డ్రైవింగ్ చేస్తూనే టీ తాగాడు.

ఇవి కూడా చదవండి

ఇక డ్రైవర్ బస్సును నడిరోడ్డుపై ఆపడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. డ్రైవర్ తీరుపై మిగతా వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే ఢిల్లీ రోడ్లపై ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక ఈయనగారి టీ ప్రేమ.. వారిని మరింత ఇబ్బందులకు గురి చేసింది. మరోవైపు.. మన సెల్ ఫోన్ రాయుళ్లు ఊరుకుంటారా? దొరికిందే ఛాన్స్ అని.. తమ ఫోన్ కెమెరాలకు పని పెట్టారు. బస్సు డ్రైవర్ బస్సును రోడ్డుపై ఆపి, టీ తీసుకురావడాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలోని సుధామ్ టీ స్టాల్ దగ్గర తీయగా..1.36 లక్షల మంది వీడియోను వీక్షించారు. వందలామంది కామెంట్స్ పెడుతున్నారు. పాపం డ్రైవర్ తప్పేమీ లేదని, సుధమ్ టీ అంత స్పెషల్ టేస్టీగా ఉండటం వల్లే ఆ డ్రైవర్ రోడ్డు బస్సు ఆపి మరీ వెళ్లాల్సి వచ్చిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..