Viral Video: కుక్కలేంటి.. చిరుత పులిని తరమడమేంటి..? ఈ వీడియో చూస్తేగానీ నమ్మలేం!

ఈ వీరభూమిలో వేట కుక్కలను తరిమిన కుందేళ్లు ఉన్నాయట అని వీరుల చరిత్ర గురించి చెప్పేటప్పడు ఉదహరిస్తుంటారు. ఆంటే ఆ ప్రాంతంలోని మట్టికి, గాలికి, నిటికి కూడా వీరత్వం ఉందని చెప్పడానికి అన్నమాట. అయితే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన ఈ సంఘటన చూశాక నిజంగానే అక్కడి మట్టికి, గాలికి వీరత్వం...

Viral Video: కుక్కలేంటి.. చిరుత పులిని తరమడమేంటి..? ఈ వీడియో చూస్తేగానీ నమ్మలేం!
Dogs Attacks On Leopard

Updated on: May 20, 2025 | 1:50 PM

ఈ వీరభూమిలో వేట కుక్కలను తరిమిన కుందేళ్లు ఉన్నాయట అని వీరుల చరిత్ర గురించి చెప్పేటప్పడు ఉదహరిస్తుంటారు. ఆంటే ఆ ప్రాంతంలోని మట్టికి, గాలికి, నిటికి కూడా వీరత్వం ఉందని చెప్పడానికి అన్నమాట. అయితే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన ఈ సంఘటన చూశాక నిజంగానే అక్కడి మట్టికి, గాలికి వీరత్వం ఉందేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే, చిరుతను చూస్తేనే ఆమడదూరం పరిగెత్తే కుక్కలు ఏకంగా ఆ చిరుతనే పరిగెత్తించి, పరిగెత్తించి తరిమాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలని దృశ్యాల ప్రకారం వీధిలోని రోడ్డుపై ఒక కుక్క నిద్రపోయి ఉంటుంది. ఒక చిరుత మెల్లగా దాని వద్దకు వచ్చి దాడి చేసింది. కుక్క మెడను నోట కరిచి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలో ఆ వీధిలోని మరికొన్ని కుక్కలు ఆ దృశ్యాన్ని చూసి అక్కడకు చేరుకున్నాయి. ఓ కుక్క ధైర్యం చేసి చిరుతపై దాడి చేసింది. ఈ టైమ్‌లో మరికొన్ని కుక్కలు గుంపుగా చిరుత మీద పడ్డాయి. దీంతో చిరుత అక్కడి నుంచి పారిపోవడం వీడియోల స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని రాజాజీ టైగర్ రిజర్వ్ సరిహద్దులో ఉన్న బీహెచ్ఈఎల్ ప్రాంతంలో రాత్రి వేళ జరిగిందీ ఘటన. అయితే చివరికి చిరుత పారిపోతూ ఓ కుక్క వెంటపడింది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది స్పష్టత లేదు. ఒక ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి.

 

వీడియో చూడండి: