Viral Video: ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో!.. వారు వెళ్లడమే ఆలస్యం.. రచ్చ రచ్చ చేసేశాయ్..!

Viral Video: చాలా మంది ప్రజలు కుక్కలను పెంచుకుంటుంటారు. విశ్వాసానికి ప్రతీక అయిన కుక్క.. మనల్ని, మన ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతుందని విశ్వాసం

Viral Video: ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో!.. వారు వెళ్లడమే ఆలస్యం.. రచ్చ రచ్చ చేసేశాయ్..!
Dog

Updated on: Apr 13, 2022 | 7:38 AM

Viral Video: చాలా మంది ప్రజలు కుక్కలను పెంచుకుంటుంటారు. విశ్వాసానికి ప్రతీక అయిన కుక్క.. మనల్ని, మన ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతుందని విశ్వాసం. అందుకే మనుషులు.. కుక్కలను ప్రేమించినట్లుగా మరే జీవిని ప్రేమించడు. అయితే, కుక్కలు అంతే విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. యజమాని పట్ల ప్రేమను కలిగి ఉంటుంది. ఇంటి యజమానులు ఎక్కడికైనా వెళ్తే.. అవే ఇంటిని ప్రొటెక్ట్ చేస్తుంటాయి. అయితే, ఇప్పుడు కాలం.. మారింది. యజమాని వెళ్లిపోవడమే ఆలస్యం.. సామ్రాజ్యం మొత్తం నాదేనంటూ తెగ రచ్చ చేసేస్తున్నాయ్. తాజాగా ఇలాంటి సీన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. రెండు కుక్కలు ఇంట్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. సరదాగా ఆడుకుంటున్నాయి. ఇంట్లో ఆ రెండు కుక్కలు తప్ప ఎవరూ లేరు. ఇంటి నిండా సామాన్లు ఉన్నాయి. అయితే, ఈ రెండు కుక్కలు తమ యజమానులు బయటకు వెళ్లగానే ఆట షురూ చేసినట్లు తెలుస్తోంది. కుక్కలు సరదాగా ఎంజాయ్ చేస్తున్న వీడియోను @ChannelInteres పేరుతో ఉన్న ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఇప్పటికి యజమాని బయటకువెళ్లాడు.’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ వీడియోకు 6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు దీనిని చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

Hair Care Tips: వేసవిలో అందమైన, మెరిసే జుట్టు కావాలా?.. అయితే, ఈ చిట్కాలను పాటించండి..!

US President Biden: అమెరికా అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. గన్ కల్చర్‌పై ప్రత్యేక ఫోకస్..

Russia – Ukraine War: ‘అమ్మా స్వర్గంలో కలుస్తా!’.. రష్యా దాడిలో చనిపోయిన తల్లికి 9 ఏళ్ల బాలిక లేఖ..