Viral Video: కుక్క దెబ్బకు తోకముడిచిన మొసలి… వైరల్‌ అవుతోన్న షాకింగ్‌ వీడియో

కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా చెబుతారు. బుక్కెడు అన్నం పెట్టిన యజమానితో పాటు ఆ ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాయి. అందుకే అనేక మంది సొంత మనుషుల మీద కాకుండా కుక్కల మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. యజమాని ఆపదలో ఉన్నాడని అందరికన్నా ముందు పసిగట్టేది..

Viral Video: కుక్క దెబ్బకు తోకముడిచిన మొసలి... వైరల్‌ అవుతోన్న షాకింగ్‌ వీడియో
Dog Fight Crocodile

Updated on: May 14, 2025 | 7:30 PM

కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా చెబుతారు. బుక్కెడు అన్నం పెట్టిన యజమానితో పాటు ఆ ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాయి. అందుకే అనేక మంది సొంత మనుషుల మీద కాకుండా కుక్కల మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. యజమాని ఆపదలో ఉన్నాడని అందరికన్నా ముందు పసిగట్టేది ఆ ఇంటి కుక్కే. ఆపద సమయంలో తనకేమైతుందనేది చూసుకోకుండా యజమానిని కాపాడేందుకు ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటాయి. తన కంటే బలమైన జంతువులతోనూ పోరాడేందుకు రంగంలోకి దిగుతుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

హఠాత్తుగా ఓ ఇంటిలోకి వచ్చిన మొసలిని చూసి అంతా భయంతో పారిపోయారు. ఓ వ్యక్తి మాత్రం ధైర్యం చేసి మొసలిని పట్టుకునేందుకు ట్రై చేశాడు. అయితే ముసలి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఇంతలో అక్కడ ఓ షాకింగ్‌ ఘటన జరిగింది. ముసలి తప్పించుకుని పారిపోతుండగా మెరుపు వేగంతో వచ్చిన కుక్క మొసలిపై అటాక్‌ చేసింది. మొసలి మెడను పట్టుకుని కదలకుండా దానికి చుక్కలు చూపించింది. ఇంతలో ఆ వ్యక్తి ఇనుప చువ్వలతో మొసలిని బంధిస్తాడు.

అయితే కుక్క ధైర్యానికి మాత్రం అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు కుక్క ధైర్యంపై ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇది మామూలు కుక్క కాదంటూ కొందరు పోస్టులు పెడుతుండగా అది మొసలి అనుకున్నావా లేక బల్లి అనుకున్నావా అంటూ మరికొందరు కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

వీడియో చూడండి: