
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ పైలట్ దాదాగిరి చేశాడు. స్పైస్‌జెట్ ప్యాసింజర్‌పై ఎయిర్ ఇండియా పైలట్ దాడి చేశాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 1లో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు అంకిత్‌దివాన్ కుటుంబం వచ్చింది. సెక్యూరిటీ చెక్ ఇన్ లైన్‌లో ఎయిర్‌ఇండియా పైలట్ మధ్యలో జొరబడ్డాడు. ప్రశ్నించిన అంకిత్‌దివాన్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. మొహంపై రక్తపు మరకలతో సోషల్‌మీడియాలో అంకిత్ పోస్ట్ వైరల్ అయింది.
పైలట్ వీరేందర్ షర్ట్‌కి అంటిన రక్తపు మరకలు తనవేనని వెల్లడించాడు అంకిత్‌దివాన్. ప్రయాణికుడిపై దాడిని ఎయిర్ ఇండియా సంస్థ ఖండించింది. పైలట్ వీరేందర్‌ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విధులనుంచి తప్పించింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పైలట్ దాడితో ప్యాసింజర్ ముక్కు ఫ్రాక్షర్ అయినట్లు తెలుస్తోంది. ఒక ప్రయాణికుడిపై దాడి చేసినట్లు చూపించే వీడియో వైరల్ కావడంతో పైలట్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఢిల్లీ పోలీసుల ప్రకారం, దివాన్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహితలోని 115, 126 మరియు 351 సెక్షన్ల కింద ఐజిఐ విమానాశ్రయ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీడియో ఫుటేజ్ తక్షణ చర్య తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిందని అధికారులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు మరియు దృశ్యాల పరిశీలన తర్వాత, నిందితుడైన పైలట్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇంతలో, వైద్య పరీక్షలో తీవ్రమైన గాయాలు బయటపడినట్లు దివాన్ పేర్కొన్నారు. CT స్కాన్‌లో “ఎడమ ముక్కు ఎముక స్థానభ్రంశం చెందిన పగులు” కనిపించిందని ఆయన అన్నారు. తాను పోలీసులకు వివరణాత్మక లిఖిత ఫిర్యాదును సమర్పించానని, ఈ కేసులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.
🎥 | A SpiceJet passenger alleges assault by an off-duty Air India Express pilot at Delhi Airport during a security check. The incident, witnessed by his family, prompted the airline to remove the pilot and launch a formal investigation.#AirIndiaExpress #DelhiAirport… pic.twitter.com/MOSVCNiCl6
— The Statesman (@TheStatesmanLtd) December 20, 2025