
సోషల్ మీడియా.. పైగా ఏఐ ప్రపంచం.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు.. ప్రస్తుత కాలంలో ఎన్నో వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఏవేవో కంటెంట్ లను సృష్టించి అరాచకాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి సోషల్ మీడియా ప్రపంచంలో, మనం ప్రతిరోజూ నమ్మశక్యం కానిది ఏదో ఒకటి చూస్తుంటాము. అలాంటి వాటిలో ప్రజలను ఆశ్చర్యపరిచే వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి.. అవి నిజమో కాదో తెలియదు.. ఎందుకంటే.. ఏఐతో సృష్టించినవి.. అలాగే.. మార్ఫింగ్ చేసినవి.. తెరపైకి వస్తుంటాయి. ఇటీవల, అలాంటి ఒక వీడియో వైరల్ అయ్యింది.. ఇంటర్నెట్‌లో తుఫానులా వ్యాపించింది. ఈ వీడియోలో, ఒక యువకుడు, యువతి రైల్వే ట్రాక్‌లపై ఆపి ఉంచబడిన సరుకు రవాణా (గూడ్స్ ట్రైన్) రైలు కింద గాఢమైన ప్రేమలో మునిగితేలుతున్నట్లు కనిపించారు. ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ కనిపించిన ఈ క్లిప్.. కాసేపట్లోనే ప్రజలను ఒక్కసారిగా భయాందోళన గురిచేసి.. ముగుస్తుంది.
వీడియోలో ఇద్దరు.. ఓ అబ్బాయి.. ఓ అమ్మాయి.. ఇద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు చుట్టుకుని .. రైలు పట్టాలపై గూడ్స్ ట్రైన్ కింద హాయిగా కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఆ అమ్మాయి పసుపు రంగు చీర కట్టుకుని ఉంది.. ఆ అబ్బాయి ఆమెను కౌగిలించుకుంటున్నాడు. వారి చుట్టూ ఎటువంటి కదలికలు కనిపించడం లేదు.. ఎవరూ చూడటం లేదని వారు అనుకుంటున్నారని సూచిస్తుంది. అయితే, వారి పైన ఉన్న సరుకు రవాణా రైలు.. అప్పుడు కదులుతుంది.. ఇది చూస్తుండగానే.. ఆ దృశ్యాన్ని భయానకంగా మారుస్తుంది.
రైలు కదిలగానే.. రెప్ప పాటులో ఇద్దరూ.. భయపడి పట్టాల నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో, అమ్మాయి పదే పదే అబ్బాయి చేతిని పట్టుకుని ఉండటం కనిపిస్తుంది.. అబ్బాయి ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. వారి ఆందోళన, వారి ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే పోరాటం కొన్ని సెకన్లలో ముగుస్తుంది.. ఇద్దరూ ప్రాణాలతో బయటపడతారు..
एक चुम्मी के चक्कर मे जान से हाथ धो बेठते pic.twitter.com/cmxvkW45jI
— Nehra Ji (@nehraji778) November 28, 2025
ఈ దృశ్యాన్ని చూసిన చాలా మంది నెటిజన్లు ఒక్కసారిగా.. షాకవుతున్నారు. వారి చర్యలు ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ, రైలు కింద నుండి ప్రాణాలతో బయటపడటంలో వారి అదృష్టాన్ని చూసి వారు ఆశ్చర్యపోతున్నారు.
అయితే, ఈ వీడియో ప్రామాణికత గురించి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. వీడియో ఎక్కడ తీశారో, ఎప్పుడు చిత్రీకరించారో స్పష్టంగా లేదు. వైరల్ కంటెంట్‌ను సృష్టించడానికి ఇది ఉద్దేశపూర్వకంగా ఏఐతో చేసిన ప్రయత్నమని అర్థమవుతుంది.. ఇలాంటి వీడియోలను అస్సలు నమ్మోద్దని సూచిస్తున్నాం..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..