Viral Video: 6 లక్షల తేనెటీగలతో కదలకుండా నిలబడి గిన్నిస్‌బుక్‌ రికార్డ్‌ సృష్టించాడు.. వీడియో వైరల్‌

Viral Video: తేనెటీగలు.. ఇవి వెంటాడాయంటే అంతే సంగతి. అవి ఉన్న ప్రాంతంలో ఎవ్వరు వెళ్లినా వెంటాడుతుంటాయి. కానీ ఓ వ్యక్తికి 6 లక్షలకుపైగా..

Viral Video: 6 లక్షల తేనెటీగలతో కదలకుండా నిలబడి గిన్నిస్‌బుక్‌ రికార్డ్‌ సృష్టించాడు.. వీడియో వైరల్‌

Updated on: Jan 17, 2022 | 7:55 AM

Viral Video: తేనెటీగలు.. ఇవి వెంటాడాయంటే అంతే సంగతి. అవి ఉన్న ప్రాంతంలో ఎవ్వరు వెళ్లినా వెంటాడుతుంటాయి. కానీ ఓ వ్యక్తికి 6 లక్షలకుపైగా తేనెటీగలు చుట్టుముట్టేశాయి. అయినా అతను ఏ మాత్రం జంకలేదు. నిజానికి ఇలాంటివి చేయడం సాహసం అనే చెప్పాలి. పైగా అతను తేనెటీగలతో గిన్నిస్‌ బుక్‌ రికార్డు సృష్టించాడు. చైనాకు చెందిన రువాన్‌ లియాంగ్‌మింగ్‌ అనే వ్యక్తి 63.7 కిలోల బరువుతో 637,000 తేనెటీగలు అతని శరీరంపై వాలాయి. అందులో 60 రాణి తేనెటీగలు కూడా ఉన్నాయి. సాధారణంగా రాణి తేనెటీగలు ఎక్కడుంటే అక్కడికి మామూలు తేనెటీగలు వెళ్తుంటాయి. రాణి తేనెటీగలకు అవి ఆకర్షితులవుతాయి. లక్షలాది తేనెటీగలు అతని చుట్టుముట్టినా అతనికి ఏమి కాలేదు. పైగా భయపడకుండా ఉండి గిన్నిస్‌బుక్‌ రికార్డు సృష్టించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్‌బుక్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు తమ యూట్యూబ్‌ చానెల్లో అప్‌లోడ్‌ చేశారు. నిజానికి ఈ సాహసం 2016లోనే సాధించాడు. కానీ తాజా ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఒకసారి తేనెటీగలు చుట్టుముట్టిన తర్వాత ఆ వ్యక్తి కదలకూడదు. ఏమి కూడా మాట్లాడకూడదు. అలాగే ఉండి పోవాల్సి ఉంటుంది. లేకపోతే ఏదో ప్రమాదం ఉందని పసిగట్టి తేనెటీగలు కుట్టే ప్రమాదం ఉంది. అందేకు అవి శరీరంపై వాలిన తర్వాత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా కదలకుండా ఉండి గిన్నిస్‌ బుక్‌ రికార్డు సృష్టించిన రువాన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Viral video: తోకను పట్టుకుని యువకుడి వెర్రి చేష్టలు.. తగిన బుద్ధి చెప్పిన ఒంటె.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

ఈ మేకకు చికెన్ బిర్యానీ, మ‌ట‌న్ లేకుంటే ముద్ద దిగ‌దు.. వీడియో