Viral Video: జనావాసాల మధ్య కూలిన విమానం…! 15 ఇళ్లకు అంటుకున్న మంటలు

అమెరికాలోని శాన్‌ డీగో లో జనావాసాల మధ్య చిన్న విమానం కూలింది. ఘటనలో దాదాపు 15 ఇళ్లకు నిప్పంటుకోగా పలు కార్లు ధ్వంసమయ్యాయి. విమాన శకలాలతోపాటు జెట్ ఇంధనం కింద పడి ఆ ప్రాంతమంతా మంటలు చెలరేగాయి. ఉదయం ఆరు గంటలకు పెద్ద శబ్దంతో విమానం కూలడంతో జనం నిద్ర నుంచి...

Viral Video: జనావాసాల మధ్య కూలిన విమానం...! 15 ఇళ్లకు అంటుకున్న మంటలు
Plan Crash

Updated on: May 23, 2025 | 7:53 PM

అమెరికాలోని శాన్‌ డీగో లో జనావాసాల మధ్య చిన్న విమానం కూలింది. ఘటనలో దాదాపు 15 ఇళ్లకు నిప్పంటుకోగా పలు కార్లు ధ్వంసమయ్యాయి. విమాన శకలాలతోపాటు జెట్ ఇంధనం కింద పడి ఆ ప్రాంతమంతా మంటలు చెలరేగాయి. ఉదయం ఆరు గంటలకు పెద్ద శబ్దంతో విమానం కూలడంతో జనం నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచారు. భయంతో ఇళ్లను ఖాళీ చేసి వెళ్లారు . 15 ఇళ్లలో మంటలు చెలరేగాయి. డజను వరకు కార్లు కాలిపోయాయని అధికారులు తెలిపారు.

జనావాసాలున్న చోట విమానం కింద పడటంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కూలిన ప్రైవేట్‌ సెస్నా విమానంలో 10 మంది వరకు ప్రయాణించే వీలుందని, అయితే ప్రమాద సమయంలో అందులో ఎంత మంది ఉన్నారనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. బుధవారం రాత్రి న్యూయార్క్‌ నగరంలోని టెటెర్రో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ తీసుకున్న ఈ విమానం కన్సాస్‌ రాష్ట్రం విచిటాలోని జబరా ఎయిర్‌పోర్టులో కాసేపు ఆగింది.

అనంతరం టేకాఫ్‌ చేసిన విమానం శాన్‌ డీగోలోని మాంట్‌గోమెరీ ఎయిర్‌పోర్టులో ల్యాండవ్వాల్సి ఉంది. మరో మూడు మైళ్ల ప్రయాణం ఉందనగా ప్రమాదంలో చిక్కుకుంది. అయితే విమానం పైలట్‌ నుంచి ఎటువంటి ప్రమాద సంకేతాలు రాలేదని అధికారులు అన్నారు. అక్కడికి సమీపంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సైనికుల నివాస ప్రాంతముందని చెప్పారు. అలాస్కాలోని ఓ కంపెనీకి చెందిన ఈ విమానం 1985లో తయారైంది. దట్టంగా మంచుకురుస్తున్న వేళ విమానం కరెంటు తీగలను తాకడం వల్ల ప్రమాదానికి గురైందన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

 

వీడియో చూడండి: