బాబోయ్‌.. జెర్రీతో జర భద్రం.. పైథాన్‌ ప్రాణాలు ఎలా తీసిందో చూస్తే వణుకే..!

వైరల్ వీడియోలో ఒక చిన్న కీటకం ప్రమాదకరమైన పామును ఓడించడం కనిపిస్తుంది. మీరు ఆ దృశ్యాన్ని చూస్తే షాక్‌ అవుతారు. వెయ్యి కాళ్ల జెర్నీ లాంటి జీవి ప్రమాదకర పైథాన్ ను ముప్పుతిప్పలు పెట్టడం నమ్మలేకుండా ఉంది. ఇంతకాలం అది తనకంటే, చిన్న కీటకాలను చంపి తింటుందని, దాని కాటుకు గురైన వారు నొప్పితో మెలికలు తిరిగిపోతారని తెలుసు. కానీ, ఈ వీడియో చూస్తే బాబోయ్ అనాల్సిందే..

బాబోయ్‌.. జెర్రీతో జర భద్రం.. పైథాన్‌ ప్రాణాలు ఎలా తీసిందో చూస్తే వణుకే..!
Centipede Kills Python

Updated on: Nov 05, 2025 | 5:45 PM

ఈ భూమిపై అనేక రకాల జీవులు నివసిస్తున్నాయి. వాటిలో కొన్ని చాలా సరళమైనవి. కొన్ని సరళంగా కనిపించవచ్చు, కానీ చాలా ప్రమాదకరమైనవి. చిన్నగా కనిపించే కొన్ని జీవులు వాస్తవానికి ప్రమాదకరమైనవి ఉన్నాయి. ఎంత బలవంతులు, ఎంతటి ధైర్యవంతులైనా సరే వాటి బారినపడ్డారో బతుకు మీద ఆశలు లేకుండా చేస్తాయి. అలా సాధారణంగా కనిపించే రెండు జీవులకు సంబంధించి సోషల్ మీడియాలో ఆశ్చర్యకరమైన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దీనిలో ఒక చిన్న కీటకం ప్రమాదకరమైన పైథాన్‌ పామును ఓడించడం కనిపిస్తుంది. మీరు ఆ దృశ్యాన్ని చూస్తే షాక్‌ అవుతారు. కానీ, ఒక చిన్న కీటకం ఆ పైథాన్‌ను ముప్పుతిప్పలు పెట్టడం నమ్మలేకుండా ఉంది. ఇంతకాలం అది తనకంటే, చిన్న కీటకాలను చంపి తింటుందని, దాని కాటుకు గురైన వారు నొప్పితో మెలికలు తిరిగిపోతారని తెలుసు. కానీ, ఈ వీడియో చూస్తే బాబోయ్ అనాల్సిందే..

వైరల్‌ వీడియోలో ఒక చిన్న జెర్రీ లాంటి జీవి భారీ పైథాన్‌ను చంపేస్తుంది. ఈ వీడియోను @TheeDarkCircle అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేశారు. ఈ 29 సెకన్ల వీడియోను 55,000 సార్లు చూశారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక వినియోగదారు ఇలా రాశారు. బాబోయ్‌ ఇదేం జెర్రీ..? ఒక కీటకం పామును చంపిందంటే నేను నమ్మలేకపోతున్నాను అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. . మరొకరు ఇలా అన్నారు..ఇది ప్రకృతి అసలైన సమతుల్యత.. ఏ జీవి చిన్నది కాదు అంటూ వ్యాఖ్యనించారు. మరో వ్యక్తి ఇలా స్పందించాడు..ఈ కీటకం మనకు బలం అంటే ఆకారం, కండపుష్టి కాదని, బలం అంటే ధైర్యం ద్వారా నిర్ణయించబడుతుందని చూపించింది అంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వైరల్ వీడియోలో, ఎక్కువ కాళ్లుండే జెర్రీపాము శరీరం చుట్టూ ఎలా చుట్టుముట్టి ఉందో కనిపిస్తుంది. పాము కాటు వేయడానికి నోరు తెరవగానే, ఆ కీటకం దానిని కుట్టడం ప్రారంభించింది. దీనివల్ల అది నొప్పితో మెలికలు తిరుగుతోంది. పాము కూడా దాడి చేసినప్పటికీ, ఆ కీటకం పైథాన్‌ను ఓడించింది. ఈ కీటకం స్కోలోపేంద్ర హీరోస్ అని చెబుతారు. ఇది అత్యంత విషపూరితమైన కీటకం. ఇది దాని న్యూరోటాక్సిక్ విషంతో విషపూరిత పాములను కూడా గాయపరుస్తుందని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..