Viral Video: బాప్‌రే.. కాస్తయితే ముసలోడు ఖతం అయితుండే… ఈ సీసీటీవీ వీడియో చూస్తే మైండ్‌ బ్లాంకే!

ఇంటిలో నుంచి బయటికెళ్లిన మనుషులు మళ్లీ సేఫ్‌గా తిరిగి వస్తారో లేదో తెలియని రోజులు ఇవి. కాలు బయట పెడితే చాలు ఏదో రూపంలో ముప్పు ఎదురయ్యే పరిస్థితులు దాపురించాయి. ఇప్పటి వరకు వీధి కుక్కల నుంచి ముప్పు మాత్రమే చూశాం. కానీ ఇక నుంచి వీధిలో తిరిగే పశువుల పట్ల అలర్ట్‌గా ఉండాల్సిందేనని ఈ వీడయో...

Viral Video: బాప్‌రే.. కాస్తయితే ముసలోడు ఖతం అయితుండే... ఈ సీసీటీవీ వీడియో చూస్తే మైండ్‌ బ్లాంకే!
Bull Attack Old Man

Updated on: Jun 07, 2025 | 7:54 PM

ఇంటిలో నుంచి బయటికెళ్లిన మనుషులు మళ్లీ సేఫ్‌గా తిరిగి వస్తారో లేదో తెలియని రోజులు ఇవి. కాలు బయట పెడితే చాలు ఏదో రూపంలో ముప్పు ఎదురయ్యే పరిస్థితులు దాపురించాయి. ఇప్పటి వరకు వీధి కుక్కల నుంచి ముప్పు మాత్రమే చూశాం. కానీ ఇక నుంచి వీధిలో తిరిగే పశువుల పట్ల అలర్ట్‌గా ఉండాల్సిందేనని ఈ వీడయో చూస్తే తెలిసిపోతుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఛత్తర్‌పూర్ ప్రాంతంలో ఓ ఎద్దు సృష్టించిన బీభత్సం చూస్తుంటేనే ఓళ్లు జలదరిస్తుంది. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్‌ కావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంటి గేటులో నుంచి బయటకు వచ్చి, రోడ్డు పక్కన స్కూటర్ వద్ద నిల్చున్న ఒక వృద్ధుడిపై ఎద్దు హఠాత్తుగా దాడికి పాల్పడింది. వృద్ధుడిని కొమ్ములతో పైకెత్తి నేలకేసి కొట్టింది. పదునైన కొమ్ములతో ఆ వ్యక్తిని పైకి లేపి, కిందపడేసి, విచక్షణారహితంగా తొక్కింది. అంతటితో ఆగకుండా వృద్దుడిని రోడ్డు మధ్యలోకి ఈడ్చుకెళ్లి, కొమ్ములతో పొడిచింది. ఈ క్రమంలో ఎద్దు కూడా కిందపడిపోయింది. ఆ ఇంటిలో నుంచి వచ్చిన మహిళలు ఎద్దును వారించబోయారు. ఎద్దు వెంటనే వారిపైకి కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఓ మహిళను కింద పడేసింది. దూరం నుంచి చూసిన స్థానికులు కర్రలు పట్టుకుని పరిగెత్తుకొచ్చారు. చివరకు, అతికష్టం మీద స్థానికులు ఎద్దును అక్కడి నుంచి తరిమేశారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

గతంలోనే ఢిల్లీలో ఎద్దు దాడి చేసిన ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. తాజా ఘటనతో ఢిల్లీలో వీధి పశువుల సమస్య మరోసారి చర్చగా మారింది. తాజా ఘటనపై నెటిజన్స్‌ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

వీడియో చూడండి: