Viral Video: టీవీ చూసి లొట్టలేసిన పిల్లి.. పెద్ద బకరా అయ్యింది.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరంతే..!

|

Dec 19, 2021 | 9:35 PM

Viral Video: సోషల్ మీడియాలో మిగతా వీడియోలకంటే.. జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పిల్లికి సంబంధించిన ఫన్నీ వీడియో..

Viral Video: టీవీ చూసి లొట్టలేసిన పిల్లి.. పెద్ద బకరా అయ్యింది.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరంతే..!
Follow us on

Viral Video: సోషల్ మీడియాలో మిగతా వీడియోలకంటే.. జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పిల్లికి సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఓరి దీని ఏశాలో అనిపించక మానదు. ఎందుకంటే.. ఈ వీడియోలోని పిల్లి టీవీ చూస్తూ.. అందులో ఉన్న పక్షులను లోట్టలేసుకుంది. దొరికి తినేద్దామనుకుని.. వాటిపైకి దూకేసింది. అయితే, అవేమో నిజం కాదాయే. అతి తెలియని పిల్లి టీవీపైకి జంప్ చేసింది. టీవీ గ్లాస్ బలంగా తగలడంతో కూయ్‌మంటూ చడీచప్పుడు కాకుండా వెనుదిరిగింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ప్రశాంతంగా పడుకున్న కుక్క.. పిల్లి చేసిన అల్లరికి హడలిపోయి లేచింది. ఒక్క క్షణం బిత్తరపోయి ఏమైందా అని అటూ ఇటూ చూసింది. ఇదంతా పిల్లి అల్లరి అని గ్రహించి మళ్లీ నిద్రకు ఉపక్రమించింది. ఈ ఫన్నీ వీడియోను @buitengebieden_ అనే ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అది చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఈ వైరల్ వీడియోలో పిల్ల టీవీ చూస్తుండగా.. ఆ పక్కనే కుక్క హాయిగా నిద్రపోతోంది. టీవీలో పక్షులు మేత మేస్తుండటం చూడొచ్చు. అయితే, టీవీలో కనిపించిన పక్షులు నిజమని భావించిన ఆ పిల్లి.. వాటిని తినాలని భావించింది. ఇంకేముంది.. మాంచి ఆకలి మీదున్న ఆ పిల్లి ఒక్క ఉదుటున టీవీలో కనిపిస్తున్న బొమ్మ పక్షులపై దూకేసింది. మరి టీవీలోని పక్షలు నిజం కావు కదా.. అతి తెలియని పిల్లి పెద్ద బకరా అయ్యింది. టీవీకి బలంగా తగిలి కింద పడిపోయింది. ఆ దెబ్బకు పిల్లి బిత్తరపోయింది. అయితే, పిల్లి కథలకు పెద్ద సౌండ్ రావడంతో పక్కనే ప్రశాంతంగా పడుకున్న కుక్క హడలిపోయి లేచింది. ఏమైందిరా బాబూ అన్నట్లుగా అటూ ఇటూ దిక్కులు చూస్తు కాసేపు షాక్‌లోనే ఉండిపోయింది. ఆ తరువాత పిల్లి వేషాలు అని గ్రహించి మళ్లీ నిద్రకు ఉపక్రమించింది. ఈ ఫన్నీ వీడియోను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. పిల్లి ఆశకు హద్దులే లేవుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పిల్లి తిక్క కుదిరిందని కొందరు అంటుంటే.. పాపం హాయిగా నిద్రపోతున్న కుక్కను లేపిందంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షకు పైగా వ్యూస్ రాగా, 20 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

Viral Video:

Also read:

Room Heaters: చలి చంపేస్తోంది..దుప్పట్లు కూడా వెచ్చదనాన్ని ఇవ్వడంలేదు..గది మొత్తం వేడి పుట్టించే ఈ హీటర్స్ ట్రై చేయండి..

Buddha Temple in Pakistan: పాకిస్తాన్‌లో వెలుగుచూసిన అతి పురాతన బౌద్ధ దేవాలయం..ఎంత పురాతనమైనది అంటే..

Lakshmi Manchu: నెట్టింట వైరల్ అవుతున్న యాక్సిడెంట్ పిక్స్‌.. క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి.. అసలేమైందంటే..?