
సోషల్ మీడియా అంటే నమ్మశక్యం అనే వార్తలు నిండివున్న అద్భుత ఫ్లాట్‌ఫామ్. ఇక్కడ మనుషులతో పాటుగా జంతువులు, పక్షులు, పాములు, మొక్కలు, చెట్లు అన్నింటికి సంబంధించి వింత వార్తలు, విచిత్ర దృశ్యాలు, ఫన్నీ సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. అయితే, తాజాగా ఎద్దు వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక ఎద్దు మొదటి అంతస్తు నుండి కిందకు దూకుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. భారీ శరీరంతో ఉన్న ఆ ఎద్దు ఒక్కసారిగా కిందకు దూకగానే పెద్ద శబ్దంతో నేలపై పడిపోతుంది. అంత ఎత్తునుండి దూకిన ఎద్దు ఎంతలా గాయపడి ఉండవచ్చు అనిపిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్ని క్షణాల్లో ఎద్దు మళ్ళీ లేచి అక్కడి నుండి వెళ్లిపోతుంది.
ఈ వీడియోను డిస్కవర్ అగ్రికల్చర్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వేలాది మంది ఈ వీడియోను చూశారు. దీనికి చాలా లైక్‌లు వచ్చాయి. ఎద్దు చేసిన ఈ సాహసోపేతమైన పనికి ప్రజలు భిన్నమైన కామెంట్లు చేశారు. నెటిజన్లలో చర్చనీయాంశం ఎద్దు పైకప్పుపైకి ఎలా ఎక్కిందనేది. అయితే, ఈ వీడియోపై ఒకరు స్పందిస్తూ..నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి దృశ్యాన్ని చూడలేదు అని రాశారు. మరొకరు ఎద్దు మనుషుల కంటే బాగా దూకింది అని చమత్కరించారు.
ఈ వీడియో ఆశ్చర్యం కలిగించడమే కాకుండా, విచ్చలవిడి జంతువులు కొన్నిసార్లు ఎలా వింత పనులు చేస్తాయో ఆలోచించేలా చేస్తుంది. ఏదేమైనా, సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. చాలా వేగంగా వైరల్ అవుతాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..