Viral Video: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జంతువులకు సంబంధించి ఎన్నో వీడియోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కొన్ని వీడియో ఎంతో ఆకట్టుకుంటాయి. మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆదర్శవంతంగా ఉంటాయి. తాజాగా ఓ గేదె, తాబేలుకు సంబంధించిన వీడియో ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు.. గేదెకు సలాం చేస్తున్నారు. మనుషుల్లో కనుమరుగవుతున్న మానవత్వం.. మూగ జీవాల్లో పరిఢవిల్లుతోందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఆ గేద అంతలా ఏం చేసింది? నెటిజన్లు ఎందుకు దానిని చూసి ఫిదా అయిపోతున్నారు? ఇప్పుడు చూద్దాం.
ఈ మధ్య కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాటి చేష్టలు, అల్లరి, అనూహ్య స్పందన.. జనాలను తెగ ఆటకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ గేదె కూడా తన చర్యతో నెటిజన్లు విపరీతంగా ఆకర్షించింది. అందరి ప్రశంసలు అందుకుంటోంది. సజాతి కాకపోయినా.. అవస్థలు పడుతున్న మరో మూగ జీవిని ఆదుకుని అందరిచే ఔరా అనిపించుకుంది. బహుశా అది జంతు ప్రదర్శనశాల కావొచ్చు.. అందులో కొంత దూరంలో రెండు జీబ్రాలు ఉండగా.. మైదాన ప్రాంతంలో చెట్టు వద్ద ఓ గేదె ఉంది. దాని పక్కనే ఓ తాబేలు రివర్స్‌గా పడిపోయి ఉంది. అది గమనించిన గేదె.. ఇబ్బందుల్లో ఉన్న ఆ తాబేలును సరి చేసేందుకు ప్రయత్నించింది. తన కొమ్ముతో ఆ తాబేలు సరి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరికి ఆ ప్రయత్నంలో విజయం సాధించింది.
వెల్లకిలా పడిపోయిన తాబేలు.. సరైంది. ఆ సమయంలో గేదె ఇచ్చిన లుక్ మామూలుగా లేదు. మరోవైపు.. సేఫ్ అయిన తాబేలు క్షేమంగా నడుస్తూ ముందుకు కదిలింది. ఈ సీన్ అంతటినీ వీడియో తీయగా.. ఆ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుత కాలంలో మనుషుల్లో మానవత్వం మసకబారుతుంటే.. మూగ జీవాల్లో మాత్రం అందుకు రివర్స్‌గా జరుగుతోందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనుషికి మనిషే సాయం చేయని ఈ రోజుల్లో మూగ జీవాలు ఒకదానికి ఒకటి సాయం చేసుకోవడం చూసి అందరూ అబ్బురపడుతున్నారు. ప్రజల హృదయాలను గెలుచుకున్న ఈ వీడియోకు వేలాది వ్యూస్ రాగా, అంతే స్థాయిలో లైక్స్ వస్తున్నాయి.
Viral Video:
Everyone can be kind…
Buffalo saving a tortoise by turning it around ?
(As shared) pic.twitter.com/Qs4mk8A2K8— Susanta Nanda IFS (@susantananda3) December 17, 2021
Also read:
Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్
MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు