Viral Video: మొత్తానికి ట్రెండ్ మార్చేశారు.. పెళ్లి రోజు ఇదేం పనండి

| Edited By: Ram Naramaneni

Mar 23, 2024 | 5:05 PM

పెళ్లి సందర్భంగా అరుంధతి చుక్క చూపించడం సాంప్రదాయం.. అయితే ఆ చుక్కని గురిపెట్టి కొట్టే రకం కొత్తగా ఏర్పడింది. తాజాగా వింత సంఘటన ముజఫర్ నగర్ ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పెళ్లి అనంతరం వధూవరులు ఈ విధంగా గాల్లో తుపాకి పేలుస్తూ వీడియోలు చిత్రీకరించారు. ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

Viral Video: మొత్తానికి ట్రెండ్ మార్చేశారు.. పెళ్లి రోజు ఇదేం పనండి
Bride Gun Firing
Follow us on

తన పెళ్లి రోజున వధువు గన్ ఫైర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 23 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో ప్రజంట్ తెగ ట్రెండ్ అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో తన వివాహ వేడుకలో వధువు చేతిలో పిస్టల్ పట్టుకుని, అనేక సార్లు కాల్పులు జరుపడం వీడియోలో కనిపించింది. సదరు వీడియోకు వేలకు పైగా వ్యూస్ రావడంతో, క్లిప్ పోలీసుల వరకు వెళ్లింది. దీంతో గురువారం నవ వధూవరులపై కేసు నమోదు చేశారు. వధువు గన్ పేల్చుతుంటే.. కొందరు పక్కనుంచి ఆమెను ఎంకరేజ్ చేశారు. ఖతౌలీ పోలీసు పరిధిలోని దుద్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. “వధూవరులిద్దరూ పిస్టల్స్‌తో డ్యాన్స్ చేస్తూ, తుపాకీతో కాల్పులు జరుపుతూ కనిపించారు. బాధ్యతా రహితంగా ప్రవర్తించడం వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని వారిపై కేసు నమోదు చేశాం” అని పోలీసులు కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

సెక్షన్ 290 (ప్రజలకు ఇబ్బంది కలిగించడం), సెక్షన్ 336 (మానవ జీవితాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్యలు) సహా భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని వివిధ సెక్షన్ల కింద వధూవరులపై FIR నమోదు అయింది. పెళ్లి రోజున అరుంధతి చుక్క చూపించడం ఒక ఎత్తు అయితే.. ఆ చుక్కని గురిపెట్టి కొట్టే రకం కొత్తగా ఏర్పడిందని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ఏది ఏమైనా దాంపత్య జీవితాన్ని ఆనందంతో ప్రారంభించాల్సిన ఈ దంపతులు.. దుందుడుకు చర్యతో చిక్కుల్లో పడ్డారు. ఆ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి.