Viral Video: ఎంటి బ్రో ఇది..కాస్త ఎటమటం అయితే.. కొత్త జంట స్టంట్స్‌పై నెటిజన్స్‌ ఫైర్‌

పెళ్లి అంటే మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. అరుందతి నక్షత్రం కాదు.. అంతకు మించి అని నిరూపిస్తున్నారు నేటి తరం. పెళ్లి వరకు ఒక ఎత్తయితే ఆ తర్వాత జరిగే తంతు మరో ఎత్తుగా మారింది. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని ఎల్లకాలం గుర్తుండిపోయేలా పెళ్లిచూపుల నుంచి పెళ్లి పీటల వరకు స్పెషల్‌గా జరుపుకునేందుకు ఏ జంట అయినా...

Viral Video: ఎంటి బ్రో ఇది..కాస్త ఎటమటం అయితే.. కొత్త జంట స్టంట్స్‌పై నెటిజన్స్‌ ఫైర్‌
Bride And Groom Stunt

Updated on: May 14, 2025 | 7:54 PM

పెళ్లి అంటే మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. అరుందతి నక్షత్రం కాదు.. అంతకు మించి అని నిరూపిస్తున్నారు నేటి తరం. పెళ్లి వరకు ఒక ఎత్తయితే ఆ తర్వాత జరిగే తంతు మరో ఎత్తుగా మారింది. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని ఎల్లకాలం గుర్తుండిపోయేలా పెళ్లిచూపుల నుంచి పెళ్లి పీటల వరకు స్పెషల్‌గా జరుపుకునేందుకు ఏ జంట అయినా ఆరాటపడుతుంటుంది. దానిలో భాగంగా పెళ్లి బరాత్‌లో ఇద్దరు కలిసి డ్యాన్స్‌ చేయడం అనేది ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. అంత వరకు ఒకే గానీ ఇక్కడో ఓ జంట అంతకు మంచి అన్నట్లు పెళ్లి ప్రవర్తించింది.

పెళ్లి తర్వాత కొత్త జంట కారుపై స్టంట్లు వేశారు. కదులుతున్న కారుపై ప్రమాదకరంగా పెళ్లికొడుకు నిలబడి కత్తి విన్యాసం చేశాడు. పెళ్లి కూతురు కూడా ప్రమాదకరంగా కారు బానెట్‌పై కూర్చుని ఓ పాటకు డ్యాన్స్‌ చేసింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

కొత్తగా పెళ్లైన జంట కదులుతున్న కారుపై విన్యాసాలు చేశారు. పెళ్లి దుస్తుల్లో ఉన్న వధూవరులు ప్రమాదకరంగా స్టంట్లు చేశారు. కదులుతున్న కారుపై నిల్చొన్న వరుడు తన చేతిలోని కత్తిని అటూ ఇటూ తిప్పాడు. పెళ్లికూతురు కూడా కదులుతున్న కారు బానెట్‌పై కూర్చుని‘ఇష్క్ కీ గలి విచ్ నో ఎంట్రీ’ పాటకు డ్యాన్స్‌ వేసింది. వీడియో వైరల్‌ కావడంతో ట్రాఫిక్‌ పోలీసుల కంట పడింది.

నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా ఆ కారు యజమానిని కనిపెట్టి జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అయితే నెటిజన్స్‌ మాత్రం వధూవరులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పోస్టులుపెడుతున్నారు.

 

వీడియో చూడండి: