Viral Video: వివాహంలో హల్దీ ఫంక్షన్ పీడకలగా మారింది… హైడ్రోజన్ బెలూన్లు పేలి వధూవరులకు కాలిన గాయాలు

ఆ పెళ్లిలో అంతా సందడిగా ఉంది. బ్యాండ్‌ మేళం వాయిస్తున్నారు. బంధుమిత్రులు నృత్యం చేస్తున్నారు, రంగులు గాలిలో వెదజల్లుతున్నారు. వధూవరుల ఎంట్రీ ఇప్పుడే ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఓ పెద్ద ప్రమాదం జరగబోతుందని వారికి తెలియదు. ఊహించని ప్రమాదం ఆ జంటను గాయపరచడమే కాకుండా...

Viral Video: వివాహంలో హల్దీ ఫంక్షన్ పీడకలగా మారింది... హైడ్రోజన్ బెలూన్లు పేలి వధూవరులకు కాలిన గాయాలు
Bride & Groom Suffer Burns

Updated on: Nov 25, 2025 | 5:14 PM

ఆ పెళ్లిలో అంతా సందడిగా ఉంది. బ్యాండ్‌ మేళం వాయిస్తున్నారు. బంధుమిత్రులు నృత్యం చేస్తున్నారు, రంగులు గాలిలో వెదజల్లుతున్నారు. వధూవరుల ఎంట్రీ ఇప్పుడే ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఓ పెద్ద ప్రమాదం జరగబోతుందని వారికి తెలియదు. ఊహించని ప్రమాదం ఆ జంటను గాయపరచడమే కాకుండా అక్కడున్న వారినందరినీ భయపెట్టింది. ప్రత్యేకంగా అలంకరించిన కొన్ని హైడ్రోజన్ బెలూన్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన ఆ జంట హల్ది వేడుకను పీడకలగా మార్చింది. వధూవరులు వేదిక వద్దకు వస్తున్న క్రమంలో మధ్యలోనే హైడ్రోజన్ బెలూన్లు పేలిపోయాయి. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో వధూవరులు చేతిలో బెలూన్‌లతో వేదికలోకి ప్రవేశిస్తున్నట్లుగా చూడొచ్చు. అయితే, కలర్ గన్‌లలో ఒకటి బెలూన్‌లను తాకిన సమయంలో హైడ్రోజన్ నిండిన బెలూన్‌లు ఒక్కసారిగా పేలిపోయాయి. వధూవరులకు చాలా దగ్గరగా బెలూన్లు పేలడంతో ఆ జంటకు కాలిన గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ వీడియోను ఇతరులలో అవగాహన కల్పించడానికి షేర్ చేశారు. “మా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు ఇంత తీవ్రమైన మలుపు తిరుగుతుందని మేము ఎప్పుడూ ఊహించలేదు” అని పోస్టులో పేర్కొన్నారు. పోస్ట్ ప్రకారం వధువు ముఖం, వీపుపై కాలిన గాయాలు అయ్యాయి. వరుడి వేళ్లు, వీపుపై కాలిన గాయాలు అయ్యాయి.

ఈ క్లిప్ వైరల్ అయ్యింది. చాలా మంది స్పందించారు. వివాహాలు వంటి ప్రత్యేక రోజులలో అలాంటి ప్రమాదకర వస్తువులను ఉపయోగించవద్దని సూచించారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు, అయితే, ఇప్పుడు దానిని తొలగించారు. ఈ క్లిప్‌ను తర్వాత ‘స్ప్రెడింగ్ సిరీస్’ హ్యాండిల్ ద్వారా యూట్యూబ్‌లో షేర్ చేశారు.

వీడియో చూడండి:

Follow Us