Viral Video: పక్షి ముక్కుతో గూడు కట్టుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా..? ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో వైరల్‌

Viral Video: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా అని చెప్పకతప్పదు. సోషల్‌ మీడియాలో ప్రతి రోజు ఎన్నో విచిత్రాలు కనిపిస్తుంటాయి. ఇక ఒక పక్షి తన కోసం, తన పిల్లల ..

Viral Video: పక్షి ముక్కుతో గూడు కట్టుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా..? ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో వైరల్‌

Edited By:

Updated on: Jun 09, 2022 | 8:39 AM

Viral Video: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా అని చెప్పకతప్పదు. సోషల్‌ మీడియాలో ప్రతి రోజు ఎన్నో విచిత్రాలు కనిపిస్తుంటాయి. ఇక ఒక పక్షి తన కోసం, తన పిల్లల కోసం గూడును ఏర్పాటు చేసుకోవడం చూసి ఉంటారు. కానీ అది గూడు కట్టేటప్పుడు ఎలా కడుతుందో చూశారా..? ఇది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. పక్షి తన కోసం గూడుకట్టుకోవడం అద్భుతమనే చెప్పాలి. పక్షి గూడును ఆకులతో తయారు చేయడం, అది కూడా ముక్కుతో ఏర్పాటు చేయడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తోంది. ముక్కు సహాయంతో గూడు ఎలా తయారు చేస్తుందని ఈ వీడియో చూసిన నెటిజన్లను ఆలోచనలో పడేసింది.’వార్బ్లర్ ఫ్యామిలీ’లో చేర్చబడిన ఈ పక్షి పేరు టేలర్‌బర్డ్. ఆకులను కుట్టడం ద్వారా తన గూడును చాలా నైపుణ్యంతో నిర్మిస్తుంది.

ఒక చిన్న పక్షి పట్టు దారంతో ఆకును కుట్టడం, దానిని గూడుగా మార్చడం మనం చూడవచ్చు. పక్షి సామర్థ్యాన్ని చూసి జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

 


@TansuYegen అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. అతని ట్వీట్‌కు 40 వేలకు పైగా లైక్‌లు, 10 వేల రీట్వీట్లు, 7 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి