
ఒక నాటకీయ సంఘటనలో క్వీన్స్‌ల్యాండ్‌లోని గోల్డ్ కోస్ట్‌లో ఒక ప్యాసింజర్ రైలు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో ట్రామ్ ట్రెయిన్‌లో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో భారీ విషాదం తప్పింది. ట్రామ్ మహిళా డ్రైవర్‌ను ముందుజాగ్రత్తగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన సెప్టెంబర్ 12 శుక్రవారం ఉదయం సర్ఫర్స్ ప్యారడైజ్‌లో జరిగింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ అంతరాయాలకు దారితీసింది.
ట్రామ్ ట్రైన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందని ఉదయం 9:20 గంటల ప్రాంతంలో స్టాఘోర్న్ అవెన్యూ, ఓషన్ అవెన్యూ మధ్య ఉన్న సర్ఫర్స్ ప్యారడైజ్ బౌలేవార్డ్‌కు అత్యవసర సేవలను పిలిపించారు. మహిళా డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించామని, ఆ సమయంలో ప్రయాణికులెవరూ లేరని పారామెడిక్స్ తెలిపారు.
నివేదికల ప్రకారం ఇంటర్‌చేంజ్ వద్ద పట్టాల అవతలి వైపుకు వెళుతుండగా పట్టాలు తప్పింది. సర్ఫర్స్ ప్యారడైజ్ బౌలేవార్డ్ ఓషన్ అవెన్యూ, పామ్ అవెన్యూ మధ్య మూసివేయబడింది. ట్రామ్ ట్రైన్‌లు ఆగిపోవడంతో ఆ ప్రాంతంలోని ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొన్నారని పోలీసులు చెప్పారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.