
Viral Video: మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ప్రజలను ఆకట్టుకునే ప్రతీ అంశంపైనా ఆయన ఇట్టే రియాక్ట్ అవుతారు. తాజాగా సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ట్రెడ్మిల్పైనా ఆయన స్పందించారు. దీనిని రూపొందించిన తెలంగాణ వ్యక్తిపై ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ వైరల్ వీడియోను ఆయన మోరోసారి ప్రస్తావిస్తూ.. రీట్వీట్ చేశారు. ట్రెడ్మిల్ రూపకర్తను ప్రశంసలతో ముంచెత్తారు.
తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి సరికొత్త ట్రెడ్‌మిల్‌ను రూపొందించాడు. విద్యుత్ అవసరం లేకుండా.. కేవలం మనం నడిస్తే అది నడిచే విధంగా చెక్కలతో రూపొందించి ఔరా అనిపించాడు. ఆ చెక్క ట్రెడ్మిల్ తయారీ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. అతని ట్యాలెంట్‌కు యావత్ సోషల్ మీడియా లోకం ఫిదా అయిపోయింది. తాజాగా ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఈ వీడియోను రీట్వీట్ చేసిన ఆయన.. తనకు కూడా ఇలాంటి ట్రెడ్మిల్ ఒకటి కావాలంటూ కోరారు. ‘‘ప్రస్తుత టెక్ యుగంలో.. హస్తకళ పట్ల మక్కువతో గంటల తరబడి కష్టపడి అంకిత భావంతో తయారు చేసిన ఈ వినూత్న పరికరం అద్భుతం. నాకూ ఒకటి కావాలి.’’ అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.
కాగా, ఆనంద్ మహీంద్రా ట్వీట్‌తో ఈ వీడియో మరింత వైరల్ అయ్యింది. అతని హస్త కళా నైపుణ్యాన్ని చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. ఇది కదా అసలైన ట్రెడ్మిల్ అంటూ తయారీదారుడికి సెల్యూట్ చేస్తున్నారు.
Also read:
Petrol Diesel Price: దేశవ్యాప్తంగా ఆందోళనలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మన నగరంలో ఇలా..
Bharti Airtel: ఆ కంపెనీలో ఎయిర్ టెల్ వాటా కొనుగోలు.. వ్యూహాత్మకంగా పెట్టుబడి..