Viral Video: ఓర్నాయనో.. ఈ మొసలి తెలివితేటలు మామూలుగా లేవుగా… కదలకుండా ఉన్న మొసలి చనిపోయిందనుకున్నారు.. ఆ తర్వాత..

మొసలి నీటిలో ఉంటే దాన్ని పట్టుకోవడం కష్టం. నీళ్లలో ఉన్న మొసలికి బయటికంటే వెయ్యి రెట్ల బలం ఉంటుంది. అదే నేలపైకి రాగానే బలహీనంగా మారిపోతుంది. మొసళ్లు తన ఎరను పట్టుకోడానికి ఎంతో తెలివిని ప్రదర్శిస్తుంటాయి. నమ్మిచ్చి మాటు వేస్తుంటాయి. నీటిలో ఏ ప్రాణి అయినా మొసలి నోటికి చిక్కిందా దాని పని అయిపోయినట్లే...

Viral Video: ఓర్నాయనో.. ఈ మొసలి తెలివితేటలు మామూలుగా లేవుగా... కదలకుండా ఉన్న మొసలి చనిపోయిందనుకున్నారు.. ఆ తర్వాత..
Crocodile Attack

Updated on: Jun 11, 2025 | 5:20 PM

మొసలి నీటిలో ఉంటే దాన్ని పట్టుకోవడం కష్టం. నీళ్లలో ఉన్న మొసలికి బయటికంటే వెయ్యి రెట్ల బలం ఉంటుంది. అదే నేలపైకి రాగానే బలహీనంగా మారిపోతుంది. మొసళ్లు తన ఎరను పట్టుకోడానికి ఎంతో తెలివిని ప్రదర్శిస్తుంటాయి. నమ్మిచ్చి మాటు వేస్తుంటాయి. నీటిలో ఏ ప్రాణి అయినా మొసలి నోటికి చిక్కిందా దాని పని అయిపోయినట్లే. తాజాగా ఓ మత్స్యకారుడికి చెమటలు పట్టించింది ఓ భారీ మొసలి. నీటిలో కదలకుండా ఉన్న మొసలి చనిపోయిందనుకొని దాన్ని కర్రతో కదిలించాడు. అంతే దాని రియాక్షన్‌కు అతని పై ప్రాణాలు పైనే పోయినంతపనైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొందరు మత్స్యకారులు నదిలో బోటు వేసుకొని చేపల వేట కోసం వెళ్తున్నారు. ఇంతలో వారి బోటుకి కొంత దూరంలో ఓ పెద్ద మొసలి కనిపించింది. అది నీటిపైన తేలియాడుతూ ఉంది. దానిని చూసి మత్స్యకారులు చనిపోయింది అనుకున్నారు. బోటును దానికి దగ్గరగా తీసుకువెళ్లినా అది కదల్లేదు. దాంతో ఓ వ్యక్తి కర్రతో మొసలి తలపై గుచ్చాడు. అంతే ఒక్కసారిగా మొసలి ఆ కర్రను విదిలించి కొట్టింది. దెబ్బకు భయంతో ఆ మత్స్యకారులు వణికిపోయారు. అంతే వెంటనే బోటును అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోయారు.

 

వీడియో చూడండి:

 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోపై నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. మొసలి తెలివితేటలు మామూలుగా లేవుగా అని ఒకరు కామెంట్‌ పోస్టు చేశారు. మొసళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకూడదని మరొకరు పోస్టులు పెట్టారు.