Viral Video: నీటిలో సరదాగా స్విమ్మింగ్ చేస్తున్న పాము.. సడెన్‌గా దూసుకొచ్చిన మొసలి.. షాకింగ్ సీన్ చూస్తే హడలే..!

Viral Video: ఈ భూ ప్రపంచంలో మనుషులు జీవిస్తున్నట్లుగానే.. కోట్లాది జంతువులు, పక్షులు, సరిసృపాలు కూడా జీవిస్తు్న్నాయి. మనుషుల జీవనశైలి కంటే.. వైల్డ్ లైఫ్ జీవన శైలి చాలా ప్రత్యేకమైనది.

Viral Video: నీటిలో సరదాగా స్విమ్మింగ్ చేస్తున్న పాము.. సడెన్‌గా దూసుకొచ్చిన మొసలి.. షాకింగ్ సీన్ చూస్తే హడలే..!
Viral

Updated on: Apr 24, 2022 | 7:41 PM

Viral Video: ఈ భూ ప్రపంచంలో మనుషులు జీవిస్తున్నట్లుగానే.. కోట్లాది జంతువులు, పక్షులు, సరిసృపాలు కూడా జీవిస్తు్న్నాయి. మనుషుల జీవనశైలి కంటే.. వైల్డ్ లైఫ్ జీవన శైలి చాలా ప్రత్యేకమైనది. అడవిలో జీవించే జంతువులలో బలం కలిగిన వాటిదే రాజ్యం అనట్లుగా ఉంటుంది. అందుకే.. అత్యంత శక్తివంతమైన సింహాన్ని అడవికి రాజుగా పేర్కొంటారు. అయితే, జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని చాలా సరదాగా, ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయానకంగా, షాకింగ్‌నుక లిగిస్తాయి. తాజాగా అలాంటి షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం.. ఓ పాము నదిలో ప్రశాంతంగా ఈదుతూ సేద తీరుతోంది. అయితే, ఆ పాముకు కొంత దూరంలోనే భారీ మొసలి కాచుకుని ఉంది. మొసలిని చూసిన పాము.. దాని నుంచి సేఫ్ అయ్యేందుకు మరోవైపు వెళ్లింది. అయితే, పాము పారిపోవడాన్ని గుర్తించిన మొసలి వేగం పెంచి పామువైపు దూసుకువచ్చింది. ఇంకేముందు.. పామును లటుక్కున మింగేసింది. ఈ సీన్‌ను క్రిస్టీ గార్జా అనే మహిళ తన కెమెరాలో రికార్డ్ చేసింది. వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. చిన్న పామును కూడా మొసలి వదలడం లేదని, మొసలి చాలా డేంజర్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు 2 లక్షలకు పైగా వ్యూస్ రాగా, వేలాది లైక్స్ వచ్చాయి.

Also read:

Love Failure: ‘నా చావు నీ పెళ్లి కానుక, ఐ లవ్ యూ’.. ప్రేయసికి లేఖ రాసిన యువకుడు.. చివరకు..!

Health Tips: థైరాయిడ్ సమస్యతో సతమతం అవుతున్నారా? ఈ 5 విషయాలపై ఓ లుక్కేయండి..!

Relationship: మీ బంధాన్ని తెంచుకోవాలని భావిస్తున్నారా? ఈ 5 ప్రశ్నలను మీకు మీరే వేసుకోండి..!

Loading...
Unable to load recommendations.
Follow Us