Viral Video: పాత స్నేహితుల డ్యాన్స్‌తో ఊగిపోయిన స్టేజ్‌… ఆరేళ్ల తర్వాత కలుసుకుంటే ఆమాత్రం ఉంటది మరి

ఫ్రెండ్స్‌తో కలిసి గడిపే సమయం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. సంతోషం, బాధ అంతా వారితోనే దాపరికం లేకుండా మాట్లాడేసుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే స్నేహితులు మెడిసిన్‌ లాంటివారు. కాలక్రమేణా స్నేహితులు కొన్ని సందర్భాల్లో దూరం కావచ్చు.. చదువు, వృత్తి ఉద్యోగాల రీత్యా వేరే చోటికి వెళ్లడం, ఫోన్‌ నంబర్‌-అడ్రస్‌ మారడం..

Viral Video: పాత స్నేహితుల డ్యాన్స్‌తో ఊగిపోయిన స్టేజ్‌... ఆరేళ్ల తర్వాత కలుసుకుంటే ఆమాత్రం ఉంటది మరి
Old Friends Dance Performan

Updated on: May 20, 2025 | 5:34 PM

ఫ్రెండ్స్‌తో కలిసి గడిపే సమయం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. సంతోషం, బాధ అంతా వారితోనే దాపరికం లేకుండా మాట్లాడేసుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే స్నేహితులు మెడిసిన్‌ లాంటివారు. కాలక్రమేణా స్నేహితులు కొన్ని సందర్భాల్లో దూరం కావచ్చు.. చదువు, వృత్తి ఉద్యోగాల రీత్యా వేరే చోటికి వెళ్లడం, ఫోన్‌ నంబర్‌-అడ్రస్‌ మారడం.. ఇలా పలు కారణాల వల్ల కమ్యునికేషన్‌ కట్‌ అవుతుంటుంది. ఇలాంటప్పుడు మన పాత స్నేహితుల్ని తిరిగి కలుసుకోవాల్సిన సమయం వస్తే.. మనసంతా భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరవుతుంది.

పాత స్నేహితులను ఓ సంగీత్‌ వేడుకులో కలుసుకునే సందర్భం ఎదురైతే మాత్రం అది కచ్చితంగా మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ స్నేహితులంతా డ్యాన్సర్స్‌ అయితే ఆ అపురూప సందర్భం వీర లేవల్‌. ఆరు సంవత్సరాల తర్వాత ఒక నృత్యకారుల బృందం కలిసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఆనందంలో వారు చేసిన డ్యాన్స్‌ ఆ వేదికను అదరగొట్టింది.

IIFA అవార్డుల ప్రదర్శనలో తమ బృందం వీర లేవల్‌ పర్ఫార్మెన్స్‌ చేసినట్లు డ్యాన్సర్స్‌ సానికా షిండే, ఓం టార్ఫే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు, ఇది కుటుంబ కార్యక్రమంలా కాకుండా పూర్తి స్థాయి డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌లా అనిపించింది.

పుష్ప 2 నుండి ట్రెండింగ్‌లో ఉన్న “పీలింగ్స్” పాటకు ఈ బృందం డ్యాన్స్‌ చేసింది. మహిళలు మొదట వేదికపైకి రావడంతో ప్రదర్శన ప్రారంభమైంది, త్వరలో పురుషులు కూడా చేరారు. ఉత్సాహభరితమైన సాంప్రదాయ దుస్తులను ధరించి, దక్షిణ భారత వైబ్‌లను ఇస్తూ, వారు తమ పవర్‌ఫుల్‌ డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకర్షించారు.

 

 

వీడియో చూడండి: