Viral Video: కొంచెం ఎటమటమైనా కొన ఊపిరి కూడా మిగలదు జాగ్రత్తా… రైలు పట్టాల మీ పడుకుని బాలుడు రీల్స్‌

ఒడిశాలోని బౌధ్ జిల్లాలో ముగ్గురు బాలురు ప్రమాదకరమైన రీతిలో రిస్కీ రీల్‌కు ప్రయత్నించారు. వైరల్‌ అవుతోన్న వీడియోలోని దృశ్యాల ప్రకారం ఒక బాలుడు రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. అతడి మీదుగా రైలు వేగంగా దూసుకెళ్లింది. ఆ తర్వాత అతడు పైకి లేచాడు...

Viral Video: కొంచెం ఎటమటమైనా కొన ఊపిరి కూడా మిగలదు జాగ్రత్తా... రైలు పట్టాల మీ పడుకుని బాలుడు రీల్స్‌
Dangerous Stunt On Railway

Updated on: Jul 07, 2025 | 10:04 AM

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావడం కోసం ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు కొంతమంది యువకులు. డేంజరస్‌ స్టంట్లు చేస్తూ రిస్కీ రీల్స్‌ చేస్తున్నారు. దీంతో ఉన్నఫలంగా ప్రాణాలను పొగొట్టుకుంటూ కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నారు. అలాంటి సంఘటనలు సోషల్‌ మీడియాలో అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. పోలీసుల హెచ్చరికలు కూడా బేఖాతర్‌ చేస్తూ ప్రమాదకరమైన రీల్స్‌ చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఒడిశాలోని బౌధ్ జిల్లాలో ముగ్గురు బాలురు ప్రమాదకరమైన రీతిలో రిస్కీ రీల్‌కు ప్రయత్నించారు. వైరల్‌ అవుతోన్న వీడియోలోని దృశ్యాల ప్రకారం ఒక బాలుడు రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. అతడి మీదుగా రైలు వేగంగా దూసుకెళ్లింది. ఆ తర్వాత అతడు పైకి లేచాడు. దీంతో ఆ బాలురు సంతోషంలో మునిగి తేలారు. వైరల్‌ అయిన ఈ వీడియో క్లిప్‌ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. పురునపాణి రైల్వే స్టేషన్‌కు సమీపంలోని దాలుపలి సమీపంలో జరిగిందీ ఘటన

కాగా, ఈ వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది. దీంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు మైనర్‌ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘నేను పట్టాల మధ్యలో పడుకున్నా. రైలు వెళ్తున్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకున్నది. నేను బతుకుతానని ఊహించలేదు’ అని ఆ బాలుడు పోలీసులకు చెప్పాడు. అయితే రీల్స్‌ పిచ్చిలో పడి ప్రమాదకర స్టంట్లు చేయవద్దని యువకులను పోలీసులు హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలు పట్టింంచుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు.

వీడియో చూడండి: