Video: దేవీ నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన నవ వధువు!

ఖర్గోన్‌లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 19 ఏళ్ల నవవధువు గర్బా నృత్యం చేస్తూ గుండెపోటుతో మరణించింది. భర్తతో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కేవలం నాలుగు నెలల క్రితమే పెళ్లైన ఇంట్లో ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Video: దేవీ నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన నవ వధువు!
Heartattack

Updated on: Sep 29, 2025 | 10:49 PM

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో నవరాత్రి వేడుకల సందర్భంగా కొత్తగా పెళ్లైన 19 ఏళ్ల ఒక మహిళ తన భర్తతో కలిసి గర్బా నృత్యం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఏంటా అని చేస్తూ పాపం ఆమె గుండెపోటుతో అక్కడికక్కడే మరణించింది. వైరల్ వీడియోలో ఆ మహిళ నృత్యం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా కుప్పకూలిన దృశ్యాలు చూడొచ్చు. ప్రేక్షకులు మొదట్లో ఇది ప్రదర్శనలో భాగమని భావించారు. ఆమెకు నాలుగు నెలల క్రితమే వివాహం అయింది.

ఎంతో సంతోషంగా తన భర్తతో కలిసి నృత్యం చేస్తుండగా గుండెపోటు వచ్చింది. దాంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమె సమీప ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొత్తగా పెళ్లి అయిన ఇంట్లో ఈ విషయం తీరని దుఃఖాన్ని మిగిలించింది. ఆమె మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి