Money from Guests: పార్టీ, ఫంక్షన్, విందు అని వినిపిస్తే చాలు పిల్లలు మొదలు.. పెద్దలు కూడా థ్రిల్ అవుతుంటారు. ఫంక్షన్‌కు వెళ్లాలంటే ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపుతారు. అయితే, ఒక్కసారి ఇలా ఊహించుకోండి.. మనకు పరిచయం లేని వ్యక్తులు పార్టీకి పిలిచి.. అద్భుతమై విందు పెట్టి.. చివరగా చేతిలో బిల్లు పెడితే ఎలా ఉంటుందంటారు?. నా సామి రంగ.. తిన్నదంతా సెకన్లలో అరిగి.. సదరు వ్యక్తుల తీరుపై చిర్రెత్తుకు రావడం ఖాయం అనే చెప్పొచ్చు. తాజాగా ఇంగ్లండ్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. పార్టీకి ఆహ్వానించి.. ఆ తరువాత చేతిలో బిల్లు పెట్టడంతో అవాక్కయ్యారు వారంతా. ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. ఈ వింత ఘటనకు సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకుందాం..
ఇటీవల ఓ మహిళ తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తాను చెప్పిన వివరాలు విని అందరూ హతాశులయ్యా. ఆ మహిళ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘పండుగ సందర్భంగా తన బంధువుల్లో ఒకరు తనను భోజనానికి పిలిచారు. కానీ, విందు పూర్తయిన తరువాత తిన్న ఫుడ్‌కి బిల్లు ఇచ్చారు. పార్టీకి వచ్చిన అతిథులందరినీ బిల్లు అడగడంతో అందరం షాక్ అయ్యాం. ఇది మరీ దారుణం అనిపించింది. కానీ, వారు అలా బిల్ అడగడాన్ని సమర్థించుకున్న విధానం బాగుంది. ఆ కారణంగా ఏ ఒక్కరూ వారి నిర్ణయాన్ని తప్పుపట్టలేదు. ప్రతి అతిథి విందు కోసం రూ. 4,500 చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఇంటి నుంచి పార్టీ వేదిక వద్దకు చేరుకోవడానికి డబుల్ మనీ ఖర్చు అయింది.’’ అని చెప్పుకొచ్చింది ఆ మహిళ.
కాగా, ఆ మహిళ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. చాలామంది నెటిజన్లు తమ తమ స్టైల్‌లో ఈ పోస్ట్‌పై అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది ఈ పద్ధతిని తప్పు పడుతుండగా.. మరికొందరు దీన్ని సమర్థిస్తున్నారు. ఇంకొందరైతే ఈ బిజినెస్ ఏదో బాగుందే అంటై సెటైర్లు పేలుస్తున్నారు. కాగా, కొందరు మాత్రం ఈ ఈవెంట్‌కు చాలా డబ్బు ఖర్చు అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు.
Also read:
Manasa Varanasi: కరోనా కల్లోలం.. మిస్ వరల్డ్ పోటీలకు షాక్.. మిస్ ఇండియాకు కోవిడ్..
Viral Video: కొబ్బరి కాయల మధ్య దాగుంది.. కూలీలు వెళ్లగానే ఒక్కసారిగా..