Viral Video: యమధర్మరాజు లంచ్ బ్రేక్‌లో ఉన్నట్లున్నాడు.. వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది

|

Aug 03, 2022 | 4:08 PM

ఈ వీడియో చూస్తే ఒక్కసారిగా మీరు స్టన్ అవుతారు. ఆ వ్యక్తి భూమిపై గడ్డి గింజలు ఉన్నాయని అనుకుంటారు. జస్ట్ మిల్లీ సెకన్ల వ్యవధిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడో వ్యక్తి.

Viral Video: యమధర్మరాజు లంచ్ బ్రేక్‌లో ఉన్నట్లున్నాడు.. వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది
Viral Video
Follow us on

Trending Video: ఫేట్ ఎప్పుడు… ఎలా ఉంటుందో చెప్పలేం. టైమ్ బాగాలేకపోతే.. ఇంట్లో కూర్చున్నా మరణం దూసుకుని రావొచ్చు.  లేచిన వేళ బాగుంటే.. అర సెకన్ వ్యవధిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడొచ్చు. మనకి డైలీ నెట్టింట(Social media) రకరకాల వీడియోలు తారసపడుతుంటాయి. కొన్ని ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. ఇంకొన్ని యాక్సిడెంట్స్‌కు సంబంధించిన వీడియోలను పోలీసులే సర్కులేట్ చేస్తుంటారు. నిబంధనలు పాటించకమే..  అలాంటి యాక్సిడెంట్స్ జరగవచ్చని వార్నింగ్స్ ఇస్తారు. తాజాగా ఓ వ్యక్తి చావు నుంచి తప్పించుకున్న వీడియో ప్రజంట్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. ఆ వ్యక్తి  రోడ్డుపై నడుచుకుంటూ వచ్చి ఓ షాపులోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. అతను అడుగులు వేసినప్పుడు డ్రైనేజ్ కాలువపై ఉన్న స్లాబ్ ఒక్కసారిగా కుదుపులకు గురైంది. అతను అలా ఆ స్లాబ్ దాటాడో లేదో అది ఒక్కసారిగా కూలిపోయింది. అతను అడుగు పెట్టినప్పుడే అది కూలిపోయి ఉంటే పెను ప్రమాదం సంభవించేది. కాగా ప్రమాదం నుంచి తప్పించుకున్న వ్యక్తి కొన్ని సెకన్లపాటు షాక్‌లో ఉండిపోవడం మీరు చూడవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. యమధర్మరాజు(Yamadharmaraju) లంచ్ బ్రేక్ లో ఉన్నట్లున్నాడు అని ఈ వీడియో షేర్ చేసిన ట్విట్టర్ యూజర్ కామెంట్ పెట్టాడు.

వీడియో దిగువన చూడండి…

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..