
మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే చాలా… ఎక్కడ చూసినా ఒంటరి పెంగ్విన్ వీడియోనే కనిపిస్తుంది. ఆ వీడియోలో పెంగ్విన్ గుంపులోంచి ఒక పెంగ్విన్ ఒంటరిగా పర్వతం వైపు నడుకుంటూ వెళ్తుంది. ఈ వీడియో చూసిన చాలా మందిలో ఆపెంగ్విన్ ఎందుకు అలా ఒంటరిగా వెళ్తుందో తెలుసుకోవాలనే ఇన్‌టెన్షన్ పెరిగింది. దీంతో చాలా మంది ఈ వీడియో కింద రకరకాల కామెంట్స్ చేశారు. దీనిపై చాలా మంది మీమ్స్ కూడా చేశారు. అయితే, ఈ వీడియో అసలు కథ వేరే ఉంది.
అసలు మ్యాటర్ ఏంటి?
అయితే మంచు ఎడారిలో ఉన్న పెంగ్విన్ గుంపు నుంచి బయటకు వచ్చిన ఒక పెంగ్విన్ దూరంగా ఉన్న ఒక భారీ కొండవైపు నడుచుకుంటూ వెళ్తుంది. అది అలానే వేల కిలోమీటర్లు నడుస్తూనే ఉంది. చివరకు దానికి ఒక వ్యక్తి అడ్డొస్తాడు. అది అక్కడి నుంచి మళ్లీ ముందుకు సాగుతుంది. అయితే ఇది ఒక డాక్యుమెంటరీలోని దృశ్యం. వెనా హెజోగ్ దర్శకత్వం వహించిన ‘ఎన్‌కౌంటర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ అనే డాక్యుమెంటరీలోని ఈ దృశ్యం మీకు కనిపిస్తుంది. సరిగ్గా 19 సంవత్సరాల తర్వాత ఈ వీడియో వైరల్ అయింది.
వీడియో చూడండి..
2014 తర్వాత మరోసారి వైరల్
ఈ వీడియోను 2010లో యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. యూట్యూబ్ నుంచి వీడియోను తీసుకున్న కొందరు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘డిప్రెస్డ్ పెంగ్విన్’ అనే క్యాప్షన్ యాడ్ చేసి షేర్ చేశారు. అప్పట్లో ఇది చాలా చర్చకు దారితీసింది. 2014లో ఈ వీడియో మళ్ళీ వైరల్ అయింది. అడెలీ పెంగ్విన్‌లు సాధారణంగా వాటి సంతానోత్పత్తి ప్రదేశాలు, ఆహారం కోసం సముద్రం దగ్గర ఉంటాయి, కానీ అవి బహిర్భూమి లేని పర్వతప్రాంతాలపైకి వెళ్లడం చాలా అరుదు. అందుకే ఈ వీడియో జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
పెంగ్విన్ పరిశోధకులు ఏమంటున్నారు
అయితే పెంగ్విన్ పరిశోధకులు మాత్రం దీని గురించి వేరే కథ చెప్పారు. పెంగ్విన్‌లు కొన్నిసార్లు రాళ్లను ఢీకొంటాయి. కొన్నిసార్లు, అవి దారి తప్పినప్పుడు, అవి గందరగోళానికి గురై ఇలా నడుస్తాయన్నారు. అసలు అవి ఎంతదూరం నడుస్తాయో అనేది చెప్పలేం అన్నారు. వాటిని తిరిగి గుంపులోకి చేర్చినప్పటికీ.. అవి మళ్ళీ ఆ పర్వతం వైపు వెళ్తాయని చెప్పారు. అయితే కొందరు మాత్రం ఇది నాడీ సంబంధిత వ్యాధి కారణంగా కావచ్చు అని అనగా… మరికొందరు చిన్న పెంగ్విన్‌లు కొత్తదనాన్ని వెతుక్కుంటూ ఇలా చేస్తాయని అంటున్నారు. కానీ నెటిజన్లు మాత్రం దీనిని ఇటీవల ప్రజలు ఎదుర్కొంటున్న నిరాశ, ఒంటరితనంతో పోల్చారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.