Viral Video: వేసవితాపం ఉపశనం కోసం నీటి జాడీలో జలకాలాడుతున్న కుక్క.. ఫన్నీ వీడియో వైరల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుక్క కు చెందిన వీడియో అందుకు భిన్నం. ఎందుకంటే ఈ వీడియోలో ఒక కుక్క నీళ్లతో నిండిన బకెట్‌లో సరదాగా జలకాలాడుతూ కనిపించింది.

Viral Video: వేసవితాపం ఉపశనం కోసం నీటి జాడీలో జలకాలాడుతున్న కుక్క.. ఫన్నీ వీడియో వైరల్
Viral Video

Updated on: May 22, 2022 | 8:27 AM

Viral Video: వేసవి కాలంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. వేడి తీవ్రత వలన శరీరంపై ఎవరో నిప్పుపెట్టి కాలిపోతున్నట్లు అనిపిస్తుంది. మండుతున్న ఎండల్లో కూడా ప్రజలు తమ పనుల నిమిత్తం ఇళ్ల నుంచి బయటకు రావాల్సి వస్తోంది. అయితే ఈ వేసవి తాపం అనేది మనుషులనే కాదు.. జంతువులను కూడా ఇబ్బంది పెడుతుంది. జంతువులు, పక్షులు నీటి కోసం అల్లాడుతూ.. అక్కడక్కడ తిరుగుతుంటాయి. తమకు నీరు దొరికిన తర్వాత అవి పడే సంతోషానికి చెందిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అలాంటి వీడియోలు ఇప్పటికే అనేకం చూసి ఉంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుక్క కు చెందిన వీడియో అందుకు భిన్నం. ఎందుకంటే ఈ వీడియోలో ఒక కుక్క నీళ్లతో నిండిన బకెట్‌లో సరదాగా జలకాలాడుతూ కనిపించింది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక కుళాయి.. అందునుంచి ఒక జాడీలో నీళ్లు పడుతున్నట్లు కనిపిస్తోంది. అలా చల్లటి నీరుతో ఆ జాడీ నిండిపోయి ఉంది. నీరుతో నిండుగా ఉన్న ఆ జాడీని చూసిన ఓ కుక్క.. తన వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి ఆ జాడీలోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. మొదట సక్సెస్ కాలేదు.. కానీ పట్టుదలతో ప్రయత్నించి..  కొంచెం టెక్నిక్ కి మరికొంచెం కష్టాన్ని జత చేసి.. చివరకు బకెట్ పైకి ఎక్కి.. నీటిలోకి దిగింది. అనంతరం ఆ నీటిలోని చల్లదనాన్ని ఆస్వాదిస్తూ.. మనిషిలా ఎంజాయ్ చేసింది. నీటిలో మునుగుతూ తేలుతూ ఆడుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో @buitengebieden అనే ట్విట్టర్‌లో ఫన్నీ క్యాప్షన్  ఇచ్చి షేర్ చేశారు. ఈ వీడియో జనాలకి విపరీతంగా నచ్చుతోంది. నాలుగు లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఈ దృశ్యం నిజంగా అద్భుతమైనదని ఒకరు కామెంట్ చేస్తే.. వేసవిలో వేడినుంచి ఉపశమనం కోసం ఎవరైనా చల్లటి నీటికోసం చూస్తారంటూ మరొకరు వ్యాఖ్యానించారు

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ ప్రయత్నించండి..

Follow Us