Viral: ఓర్నీ.. మాంచి ఎత్తులే వేశారు.. కానీ అడ్డంగా చిక్కారు.. ఎంతైనా కళాకారులు

|

Feb 10, 2023 | 8:40 PM

గవర్నమెంట్ జాబ్ కొట్టేందుకు వీరు చూడండి ఎన్ని ఎత్తులు వేశారో. కానీ అధికారులు చాకచక్యంగా వ్యవహరించడంతో అడ్డంగా బుక్కయ్యారు.

Viral: ఓర్నీ.. మాంచి ఎత్తులే వేశారు.. కానీ అడ్డంగా చిక్కారు.. ఎంతైనా కళాకారులు
Fitness Test Fraud
Follow us on

ఇలాంటివారికి జాబ్ వస్తే.. ఇంకేమైనా ఉంటుందా..? వీలైనన్ని అడ్డదారులు తొక్కేస్తారు. లేకపోతే ఏంటండీ… కర్ణాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో కొలువులు పట్టేందుకు అడ్డమైన ఎత్తులు వేశారు. నలుగురు అభ్యర్థులు ఫిజికల్​ టెస్ట్​ల్లో రూల్స్‌కి విరుద్దంగా వ్యవహరించారు. బాడీ వెయిట్ ఎక్కువ చూపేందుకు ఒకరు అండర్​వేర్​లో తూకపు రాళ్లు పెట్టుకుని రాగా.. మరొకరు షర్ట్ లోపల రాళ్లు దాచి నాటకాలు ఆడారు. ఇంకో వ్యక్తి ఏకంగా నడుముకు ఐరన్ చైన్ చుట్టుకుని వచ్చాడు. నిర్దేశించిన బరువు లేకపోవడంతో.. ఈ తరహా ఎత్తులు వేశారు.

కంప్లీట్ డీటేల్స్‌లోకి వెళ్తే…  కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్​,​ మేనేజర్​ పోస్ట్‌లకు నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 1,619 జాబ్స్‌ను ఫిట్​నెట్​ టెస్టుల ద్వారా భర్తీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం నిర్ణీత ఎత్తుతో పాటు 55 కిలోల బరువును అర్హతగా పేర్కొన్నారు. మొత్తం 38వేల మందికి పైగా క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కోసం అప్లై చేవారు. కలబురిగి జిల్లాలో ఈ ఉద్యోగాలకు ఈ జాబ్స్‌కు సంబంధించి ఫిజికల్​ ఫిట్​నెస్​ టెస్టులు జరిగాయి. ఎత్తులో అర్హత సాధించిన ఓ నలుగురు క్యాండిడేట్స్.. శరీర బరువు తక్కువ వస్తుందన్న అనుమానంతో ఇలా తూకపు రాళ్లు, ఐరన్ చైన్స్‌తో అక్రమాలకు పాల్పడ్డారు.

రూల్స్‌కు విరుద్ధంగా వ్యహరించిన ఆ నలుగురు అభ్యర్థులను అధికారులు పట్టేశారు. వారిని అనర్హులుగా ప్రకటించారు. కాగా వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. మానవతా దృక్పథంతో వారిని వదిలేసినట్లు తెలిపారు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేస్తే.. కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.

రిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..