Sparrow: ఊరంతా ఏకమై పిచ్చుకకు అంత్యక్రియలు.. సమాధి కట్టి దశదినకర్మ.. ”తిరిగి రా” అని బ్యానర్లు..

ఆత్మీయులు మన నుంచి దూరమైనప్పుడు కలిగే బాధను మాటల్లో చెప్పలేం. ఆ దుఖం నుంచి బయటపడటం అంత తేలికైన విషయం కాదు. కర్ణాటకలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు...

Sparrow: ఊరంతా ఏకమై పిచ్చుకకు అంత్యక్రియలు.. సమాధి కట్టి దశదినకర్మ.. తిరిగి రా అని బ్యానర్లు..
Sparrow

Updated on: Feb 09, 2022 | 7:16 AM

ఆత్మీయులు మన నుంచి దూరమైనప్పుడు కలిగే బాధను మాటల్లో చెప్పలేం. ఆ దుఖం నుంచి బయటపడటం అంత తేలికైన విషయం కాదు. కర్ణాటకలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఓ పిచ్చుకపై ఎనలేని ఆప్యాయతను పెంచుకున్నారు. దానికి గింజలు, దాణా వేస్తూ ప్రేమగా చూసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆ పిచ్చుక చనిపోయింది. దీంతో ఈ గ్రామస్థులు తీవ్ర దుఖసాగరంలో మునిగిపోయారు. ప్రేమగా చూసుకుంటున్న పిచ్చుక ఇకపై కనిపించదంటూ భావోద్వేగానికి గురయ్యారు. దానికోసం ఓ సమాధి కట్టించి, దశదినకర్మ జరిపించారు. కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ జిల్లా శిడ్లఘట్ట తాలూకా బసవ పట్టణంలోని చాలా పిచ్చుకలు ఉండేవి. పిచ్చుకలకు అవసరమైన దాణా, గింజలు, నీటిని ఏర్పాటు చేసేందుకు చాలా ఇళ్లల్లో ప్రత్యేక నిర్మాణాలు ఉండేవి.

ఆ గ్రామస్థులకు వాటిలో ఓ పిచ్చుక ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆ పిచ్చుక రోజూ క్రమం తప్పకుండా అన్ని ఇళ్ల ఆవరణలకు వచ్చేది. వారు వేసిన గింజలను తిని వెళ్లేది. దీంతో వారు ఆ పిచ్చుకపై మమకారం పెంచుకున్నారు. అయితే జనవరి 26న ఆ పిచ్చుక చనిపోయింది. ఈ విషయాన్ని ఆ గ్రామస్థులు జీర్ణించుకోలేకపోయారు. తమ ఇళ్లను ఎప్పడూ ఆప్యాయంగా పలకరించే పిచ్చుక ఇకపై లేదని తెలిసి కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాకుండా చనిపోయిన పిచ్చుక కోసం ఏదైనా చేయాలని ఓ ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు. అందరూ ఒక చోట చేరి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేశారు. దీనితో ఆగకుండా సమాధి కట్టి, దశదిన కర్మ సైతం జరిపించారు. ‘తిరిగి రా’ అంటూ శ్రద్ధాంజలి పోస్టర్లు వేయించారు. భారీగా వంటలు చేయించి, ఊరందరికీ పెట్టారు.

Also Read

Renault India: కార్ల విక్రయాలలో దూసుకుపోతున్న రెనాల్ట్‌.. 8 లక్షలకు చేరిన విక్రయాలు..!

POCO M4 Pro 5G: పోకో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్.. త్వరలోనే భారత్‌లో లాంచ్.. కెమెరా ఫీచర్స్ ఇవే..

రాత్రిపూట పడుకునే ముందు వేడి నీళ్లు తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..